Mahesh Babu బాలీవుడ్ నన్ను భరించలేదు.. టైమ్ వేస్ట్ అంటూ మహేష్ వ్యాఖ్యలు.. భగ్గుమన్న జాతీయ మీడియా

సర్కారు వారీ పాట చిత్రం రిలీజ్‌కు ముస్తాబైన నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి జోష్‌తో కనిపిస్తున్నారు. జీఎంబీ బ్యానర్‌పై మహేష్ నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ మేజర్ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలుగు, హిందీ మీడియా అడిగిన ప్రశ్నలకు సావధానం సమాధానాలు చెప్పారు. అయితే బాలీవుడ్‌లో సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదంటూ చెప్పిన విషయం ప్రస్తుతం జాతీయ స్థాయిలో వివాదంగా మారింది. మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారడానికి కారణం ఏమిటంటే?

నా తెలుగు సినిమాలు హిందీలోకి..

నా తెలుగు సినిమాలు హిందీలోకి..

జాతీయ మీడియాకు చెందిన రిపోర్టర్ ప్రశ్న వేస్తూ.. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. హిందీలో కూడా మీకు భారీగా అభిమానులు ఉన్నారు. అయితే హిందీ సినిమా రంగంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారు అని అడిగితే.. తెలుగులో వస్తున్న సినిమాలనే హిందీలో రిలీజ్ చేస్తాం. అలా హిందీ ప్రేక్షకులకు చేరువ అవుతాం అని విధంగా మహేష్ బాబు సమాధానం ఇచ్చారు.

నా టైమ్ వేస్ట్ చేసుకోను

నా టైమ్ వేస్ట్ చేసుకోను

బాలీవుడ్ ఎంట్రీపై మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. హిందీ సినిమా పరిశ్రమ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే వాళ్లకు భరించేంత శక్తి ఉందనుకోవడం లేదు. నా టైమ్‌ను వేస్ట్ చేసుకోను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు మంచి స్టార్‌డమ్, ప్రేమ ఉంది. నాకు మరో ఇండస్ట్రీకి వెళ్లాలనే కోరిక, ఆలోచనలు లేవు అని మహేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.

మరో భాషలో నటించను అంటూ మహేష్

మరో భాషలో నటించను అంటూ మహేష్


తెలుుగు సినిమా రంగంలోనే సినిమాలు చేస్తే.. అవి బ్లాక్‌బస్టర్లుగా మారుతున్నాయి. నా సినిమాల పట్ల నా విజన్ పర్‌ఫెక్ట్‌గా ఉంది. అందుకే తెలుగు సినిమా పరిశ్రమను వదిలి మరో భాషా రంగంలోకి వెళ్లాలని కోరుకోవడం లేదు. అని మహేష్ బాబు అన్నారు. దాంతో మహేష్ బాబు వ్యాఖ్యాలు బాలీవుడ్ మీడియాలో ప్రధాన ఆకర్షణగా మారాయి. మహేష్ బాబు భాష అంతరాలు చూపించారంటూ హిందీ భాషలో నటించడం ఇష్టం లేదని చెప్పడాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

తెలుగు వాళ్లంతా గర్వపడాలి

తెలుగు వాళ్లంతా గర్వపడాలి

సర్కారు వారీ పాట సినిమా రిలీజ్ నేపథ్యంలో ఇటీవల తెలుగు మీడియాతో మాట్లాడుతూ.. వేరే భాషలకు వెళ్లే ప్రసక్తి లేదు. మన భాషలోనే సినిమాలు చేస్తాను. అందుకు తెలుగు వాళ్లంతా గర్వపడాలి. రాజమౌళి సినిమా చేస్తే అది ప్యాన్ ఇండియాగా మారే అవకాశం ఉంది. కానీ నా బ్యానర్‌లో మంచి చిత్రాలు నిర్మించి దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తాను అని మహేష్ బాబు అన్నారు.

కీర్తి సురేష్‌తో అదిరిపోయే ట్రాక్

కీర్తి సురేష్‌తో అదిరిపోయే ట్రాక్

ఇక సర్కారు వారీ పాట సినిమా గురించి మాట్లాడుతూ.. పోకిరి సినిమాలో ఉన్నట్టుగా నా క్యారెక్టర్‌లో కొత్త ఎనర్జీ ఉంటుంది. ఫస్టాఫ్‌లో కీర్తీ సురేష్‌తో లవ్ ట్రాక్ బాగుంటుంది. దూకుడు సినిమాకి రిపీట్ ఆడియన్స్ వచ్చారు, ఫారిన్‌లో ఉన్న లవ్ ట్రాక్ రిపీట్ ఆడియన్స్ రావడానికి మెయిన్ రీజన్. ఈ చిత్రంలో కూడా అలాంటి అద్భుతమైన లవ్ ట్రాక్ కుదిరింది. ఖచ్చితంగా ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూస్తారు అని మహేష్ బాబు తెలిపారు. సర్కారు వారీ పాట మే 12వ తేదీన రిలీజ్ అవుతున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X