For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిరుద్యోగికి అండగా నిలిచిన నవీన్ పోలిశెట్టి.. ఒక్క ట్వీట్‌ ఓ జీవితాన్ని మార్చేసింది. నిజంగా జాతిరత్నమే అంటూ!

  |

  ఇంట గెలిచి రచ్చ గెలువాలనేది అందరికి తెలిసిన సామెత. అయితే యువ నటుడు నవీన్ పోలిశెట్టి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తాడు. ముందు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకొన్న తర్వాత టాలీవుడ్‌లో పాపులారిటీని సంపాదించుకొన్నాడు. హిందీలో రియాలిటీ షోలు, టాక్ షోలతో సోషల్ మీడియాలో టాక్ సంపాదించుకొన్న నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్‌లో టాప్ డిమాండ్ ఉన్న యువ హీరోల్లో ఒకడిగా మారారు. కరోనా సమయంలో తనకు వీలైనంత మేరకు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సహాయం చేస్తున్నారు. బాధితులతో వీడియో కాల్స్‌లో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెబుతూ, తనను సంప్రదిస్తున్న వారికి సహాయం అందిస్తున్నారు. తాజా ఆయన చేసిన సహాయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

  నవీన్ పొలిశెట్టి దృష్టికి

  నవీన్ పొలిశెట్టి దృష్టికి

  తాజాగా కరోనావైరస్ పరిస్థితుల కారణంగా యువకులు, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇటీవల చాలా మంది యువకులు ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. అలాంటి వారిలో ఒక యువకుడు తన ఉద్యోగం పోయిందంటూ ట్విట్టర్‌లో, సోషల్ మీడియా అకౌంట్లలో ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే యువకుడి ఆవేదన నవీన్ పోలిశెట్టి దృష్టికి రావడంతో వెంటనే ట్విట్టర్‌లో స్పందించారు.

  సాయి పల్లవిని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్

  నిరుద్యోగికి హెల్ప్ చేయండి అంటూ

  నిరుద్యోగికి హెల్ప్ చేయండి అంటూ

  నవీన్ పోలిశెట్టి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. కరోనా మహమ్మారి కారణంగా ఓ యువకుడు నిరుద్యోగిగా మారాడు. అతడు హోటల్ ఇండస్ట్రీలో పనిచేశాడు. రెస్టారెంట్‌లో షిఫ్ట్ మేనేజర్‌గా, ఇతర ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. హైదరాబాద్‌లోని పబ్‌లో గానీ లేదా రెస్టారెంట్‌లో గానీ ఏదైనా ఉద్యోగం ఉంటే, ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయని తెలిస్తే.. యువకుడి నంబర్‌కు ఫోన్ చేయండి అంటూ నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు.

  Ashnoor Kaur సీబీఎస్‌ఈలో 94శాతంతో టాప్ లేపిన యువ హీరోయిన్.. మీరెప్పుడూ చూడని గ్లామరస్ ఫోటోలు

  నిరుద్యోగికి ఆఫర్ లెటర్ రావడంతో

  నిరుద్యోగికి ఆఫర్ లెటర్ రావడంతో

  అయితే నవీన్ పోలిశెట్టి ట్వీట్‌కు స్పందించిన కొందరు ఆ నిరుద్యోగికి సహాయం చేయడంతో ఉద్యోగం లభించింది. ఎవోక్ అనే సంస్థ ఉద్యోగం ఇస్తూ ఆ యువకుడిని ఆదుకొన్నది. తనకు ఆఫర్ లెటర్ రావడంతో యువకుడు ఆనందపడిపోయి నవీన్ పోలిశెట్టికి ధన్యవాదాలు తెలుపుకొన్నారు. మీ వల్లే ఈ ఉద్యోగం లభించిందని ఆఫర్ లెటర్‌ను యువకుడు పోస్టు చేశారు.

  క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన యాంకర్ మంజూష.. రష్మీ, అనసూయకు పోటీ ఇచ్చేలా హాట్ స్టిల్స్

  నేను చెప్పిన యువకుడికి ఉద్యోగం అంటూ

  నేను చెప్పిన యువకుడికి ఉద్యోగం అంటూ

  యువకుడు పోస్ట్ ఆఫర్ లెటర్‌ను తన ట్విట్టర్‌ ఖాతాలో నవీన్ ట్వీట్ చేశారు. ఆ యువకుడికి ఉద్యోగం లభించింది. ఈవోక్ కేఫ్ ఇచ్చిన ఆఫర్ లెటర్ ఇదే. నేను కేఫ్‌కు వెళ్లి ఆ యువకుడిని త్వరలోనే కలుస్తాను. నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు కారణమైన చరణ్, సౌమ్యకు ధన్యవాదాలు. కరోనా కారణంగా నిరుద్యోగులుగా మారిన వారికి ఉద్యోగాలు ఇప్పించేలా చేద్దాం. అందుకు మీ వంతు సహకారం అందించండి అంటూ నవీన్ పోలిశెట్టి కామెంట్ చేశారు. నవీన్ చూపిన చోరవకు నిజంగా మీరు జాతిరత్నమే అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

  Dhee Fame Deepika Pilli అందాల విందు.. మోడ్రన్ డ్రెస్‌లో ఇలా ఎప్పుడైనా చూశారా?

  Gold Medal Movie Team Exclusive Interview
  నవీన్ పొలిశెట్టి కెరీర్ ఇలా...

  నవీన్ పొలిశెట్టి కెరీర్ ఇలా...

  నవీన్ పొలిశెట్టి వ్యక్తిగత జీవితానికి వస్తే.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగాడు. బీటెక్ తర్వాత పూణేలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌కు ఉన్నత విద్య కోసం వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి నటుడిగా కెరీర్ ఆరంభించాడు. తొలుత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో నటించాడు. ఆ తర్వాత డీ ఫర్ దోపిడి, 1: నేనొక్కడినే, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు చిత్రాల్లో నటించాడు. బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కలసి, చిచ్చోరే‌లో కీలక పాత్రలో కనిపించాడు. జాతి రత్నాలు సినిమా తర్వాత భారీ, క్రేజీ చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతున్నాడు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Naveen Polishetty tweet changes a unemployed guys fate. He tweeted that
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X