For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sai Dharam Tej ఐసీయూలోకి మీడియా కెమెరాలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో నిఖిల్

  |

  ఇటీవల మెగాహీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో సెప్టెంబర్ 10 శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కు కాలర్‌బోన్‌కు ఫ్రాక్చర్ అయ్యి ఛాతీ మరియు కడుపుపై గాయాలు అయ్యాయి. ఇక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ప్రత్యక్ష సాక్షుల నుండి వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత ర్యాష్ డ్రైవింగ్ వలన పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఒక్కసారిగా ఆ న్యూస్ అందరిని షాక్ కు గురి చేసింది. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని సినీనటులు అభిమానులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

  కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాస్పిటల్ కి వెళ్లి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ప్రత్యక్షంగా వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. అయితే ఈ ఘటన సమయంలో సాయి ధరమ్ తేజ్ కాస్త ప్రైవసీ ఇవ్వాలని అంటూ యువ హీరో నిఖిల్ కూడా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. ఐసీయూలో కూడా కెమెరాలు ఎలా వెళుతున్నాయి అని ప్రశ్నిస్తూ.. సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన వీడియోలు బయటకు రావడం చాలా బాధాకరంగా ఉన్నాయని అన్నాడు. ఒక మనిషికి కనీస మర్యాద ఇవ్వాలని అలాగే ప్రైవసీ కూడా చాలా ముఖ్యమని తెలియజేశారు. యాక్సిడెంట్ అయినప్పుడు నుంచి కూడా మీడియాలో ఎక్కువగా సాయి ధరంతేజ్ కు సంబంధించిన వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి గాయపడినప్పుడు కూడా హాస్పిటల్ లోని కొన్ని వీడియోలు లీక్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి కలిగించింది. ఇలాంటి కఠిన సమయంలో ప్రైవసీ చాలా ముఖ్యమని కొంతమంది సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

  Nikhil Siddharth special tweet on sai dharam tej privacy videos

  ఇక హీరో నిఖీల్ కూడా సాయి ధరంతేజ్ కు మద్దతుగా నిలుస్తూ అసలు ఐసీయూ కెమెరా ఎలా వెళ్తుంది అని ప్రశ్నించాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కూడా నిఖిల్ సిద్దార్థ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ హై-ఎండ్ స్పోర్ట్స్ బైక్ రోడ్డుపై అదుపు తప్పి కింద పడినట్లు సీసీ టీవీ ఆధారంగా తెలిసింది. అక్కడ ఇసుక ఎక్కువగా ఉండడం వల్లనే అతను కొంత దూరం వరకు అలానే కిందపడి లాగబడ్డాడు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఎడమ వైపు నుండి ఆటోరిక్షాను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. అయితే, వాహనం అధిక వేగంతో ఉన్నందున, ఇసుక ప్యాచ్‌పైకి వెళ్లడంతో అతను నియంత్రణ కోల్పోయాడు. బైక్‌తో పాటుగా నటుడు కొన్ని మీటర్లు రోడ్డుపైకి లాగబడినట్లు అనిపించింది.

  అదృష్టవశాత్తూ సంఘటన జరిగినప్పుడు ఎక్కువ వాహనాలు లేవు. నటుడు హెల్మెట్ కూడా ధరించాడుమ్ ఇది అతని తలకు గాయాలను తగ్గించింది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ సమీపంలో ఉన్న ఒక ఒక షాపింగ్ మాల్ సెక్యూరిటీ కార్డు సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాడు. వెంటనే 108కి ఫోన్ చేయడం వల్ల 10 నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి ఆంబులెన్స్ చేరుకుంది ఇక మధ్యలోనే 108 సిబ్బంది సాయి ధరమ్ తేజ్ పరిస్థితిని బట్టి చికిత్స చేసి పెను ప్రమాదం నుంచి తప్పించారు. అలాగే ఆ సమయంలో అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కూడా తెలివిగా ట్రాఫిక్ ను నియంత్రించి అంబులెన్స్ త్వరగా హాస్పిటల్ కు చేరుకునేందుకు సహాయపడ్డాడు.

  English summary
  Nikhil Siddharth special tweet on sai dharam tej privacy videos
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X