twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ నితిన్‌.. కరోనా సమయంలో రియల్ హీరోగా.. తెలుగు రాష్ట్రాలకు భారీ సహాయం

    |

    క‌రోనా వైర‌స్ తెలుగు రాష్ట్రాలనే కాదు.. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. పలు జిల్లాలో పరిస్థితి చేజారిపోయితున్నట్టు స్పష్టమవుతున్నాయి. రాష్ట్రంలోని పరిస్థితులు దిగజారకుండా పలువురు తమ వంతు బాధ్యతగా ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో నితిన్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళం ప్రకటించారు.

    Recommended Video

    Hero Nithiin Donated 10 Lakhs Each To Telugu States
    కరోనా వ్యాప్తి నిరోధంలో

    కరోనా వ్యాప్తి నిరోధంలో


    కరోనా వ్యాప్తి నిరోధంలో త‌న వంతు భాగ‌స్వామ్యం అందించాల‌ని నిర్ణయించుకొన్న హీరో నితిన్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి చెరో 10 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని అందజేయడానికి నిర్ణయించారు.

    లాక్‌డౌన్‌కు సహకరించాలి

    లాక్‌డౌన్‌కు సహకరించాలి

    ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. కరోనా క‌ట్ట‌డికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నాయి. రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాలి. మార్చి 31వ తేదీ వ‌ర‌కు ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి. అంద‌రూ త‌మ త‌మ ఇళ్ల‌ల్లోనే ఉండి, కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించ‌డంలో పాలు పంచుకోవాలి అని నితిన్ విజ్ఞ‌ప్తి చేశారు.

    భారీ హిట్‌తో నితిన్

    భారీ హిట్‌తో నితిన్


    నితిన్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన నటించిన భీష్మ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. రష్మికతో కలిసి నటించిన ఈ చిత్రం వినోదంతోపాటు సామాజిక బాధ్యతను తెలియజెప్పింది. ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది.

    త్వరలో డెస్టినేషన్ వెడ్డింగ్

    త్వరలో డెస్టినేషన్ వెడ్డింగ్


    ఇక వ్యక్తిగత విషయానికి వస్తే.. నితిన్ పెళ్లి ఏప్రిల్ 16, 17వ తేదీలలో జరుగాల్సి ఉంది. దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరుపాలని నిర్ణయించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు నెలకొన్న నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేసేందుకు ప్లాన్ చేస్తున్నారని, లేకపోతే అదే ముహుర్తానికి వేదికను మార్చే ఆలోచనలో ఉన్నట్టు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే.

    English summary
    Actor Nithiin 10 Lakhs donated to Telugu States for Coronavirus control. He is going to give donation to Both Telugu States CM Relief fund.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X