మరో ప్లాప్ డైరెక్టర్ తో నితిన్ మూవీ.. ఎవరు చెప్పినా వినకుండా డేట్ ఫిక్స్!
టాలీవుడ్ యువ హీరో నితిన్ భీష్మ అనంతరం చాలా స్పీడ్ పెంచాడు. ఆ సినిమా తరువాత వెంటవెంటనే మూడు సినిమాలను సెట్స్ పైకి తేవాలని అనుకున్నాడు. కానీ కరోనా దెబ్బకు అన్ని సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ ఏడాది మొదట్లో నితిన్ చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.
ఇక ఎంతో నమ్మకంతో చేసిన రంగ్ దే కూడా అంచనాలకు తగ్గట్లుగా క్లిక్కవ్వలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ అందుకోవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక ప్రస్తుతం తన ఆశలన్నీ కూడా మాస్ట్రో సినిమాపైనే పెట్టుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం దర్శకుడు మెర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాపై నితిన్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అలాగే సీనియర్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో కూడా నితిన్ మరొక సినిమా చేయబోతున్నాడు.

ఇదివరకే నా పేరు సూర్య సినిమాతో డిజాస్టర్ అందుకున్న వంశీ ఇప్పుడు నితిన్ తో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఇక లాంచ్ విషయంలో నితిన్ తొందరపడుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ లోనే సినిమాను స్టార్ట్ చేయనున్నారట. కోవిడ్ టైమ్ లో రిస్క్ వద్దని చెప్పినప్పటికీ నితిన్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే చెక్ తరహాలోనే ఫినిష్ చేయవచ్చని డిసైడ్ అయ్యాడట. మాస్ట్రో సినిమాతో పాటు వక్కంతం వంశీ సినిమాలను వీలైనంత తోందరగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











