నితిన్ స్పీడ్ మాములుగా లేదుగా.. ఈసారి మరింత వేగంగా న్యూ మూవీ
టాలీవుడ్ హీరో నితిన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకు ముందుకు బాగానే వస్తున్నాడు. కానీ గతంలో మాదిరిగా వరుసగా హిట్స్ అందుకోవడంలో విఫలం అవుతున్నాడు. నితిన్ లక్కేమిటో గాని ప్రతి సినిమాకు కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తుంటాడు. భీష్మ సినిమాతో కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.
అసలైతే గత ఏడాది నితిన్ వరుసగా మూడు సినిమాలతో రావాలని అనుకున్నాడు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా కుదరలేదు. ఇక మొత్తానికి లాక్ డౌన్ అనంతరం చెక్, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలు రెండు కూడా అనుకున్నంతగా హిట్టవ్వలేదు. అయినప్పటికీ నితిన్ స్పీడ్ తగ్గలేదు.

మరోసారి జెట్ స్పీడ్ లో మరొక సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నాడు. బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ మాస్ట్రో తో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ట్రో సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. వీలైనంత వరకు తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా మేకింగ్ లో మార్పులు తెచ్చినట్లు సమాచారం.
ఇక సినిమాను లాక్ డౌన్ అనంతరం పరిస్థితులను బట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. నాభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా భాటియా కీలకమైన బోల్డ్ పాత్రలో నటిస్తోంది. మరి ఈ సినిమాతో అయినా నితిన్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











