twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్నగారి వల్ల పైకొచ్చారు, సాయం చేయలేదు, అంతా కమర్షియలే: ఆర్యన్ రాజేష్

    |

    ప్రముఖ దర్శకుడు ఈవివి స్యతనారాయణ వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆర్యన్ రాజేష్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయాడు. గత ఆరేళ్లుగా ఆయన ఏ సినిమాలోనూ నటించలేదు. మూడేళ్ల క్రితం 'బందిపోటు' సినిమా ద్వారా నిర్మాతగా మారినా అది కూడా వర్కౌట్ కాలేదు.

    తాజాగా రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' సినిమా ద్వారా ఆర్యన్ మళ్లీ నటుడిగా రీ లాంచ్ అవుతున్నారు. జనవరి 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఆర్యన్ రాజేష్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.

    ఆ సినిమా ఫెయిలైంది

    ఆ సినిమా ఫెయిలైంది

    మళ్లీ నటుడిగా రీ లాంచ్ అవుతున్న నేపథ్యంలో ఆర్యన్ రాజేష్ ఓ వెబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మా సొంత బేనర్లో మూడేళ్ల క్రితం ‘బందిపోటు' చేశాం. అది ఫెయిలైంది. చేస్తే మంచి కథ చేయాలి... మళ్లీ అలాంటి తప్పు చేయకూడదని వెయిట్ చేశాం. 2019లో మా బేనర్లో ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్ రాబోతోందని తెలిపారు.

    లక్కీగా ఈ సినిమా దొరికింది

    లక్కీగా ఈ సినిమా దొరికింది

    నాన్నగారు ఉన్నపుడు నన్ను హీరోగా పెట్టి సినిమాలు చేశారు. ఆయన పోయిన తర్వాత నా కెరీర్‌కు హెల్ప్ అయ్యే అవకాశాలు రాలేదు. సినిమా నిర్మించడానికి ధైర్యం సరిపోలేదు. పాదర్ ఉంటే ఆ సపోర్ట్ వేరేలా ఉంటుంది. ధైర్యం చేసి ‘బందిపోటు' మొదలు పెడితే ఎక్కడో తప్పు జరిగి ఫెయిలైంది. నా రీలాంచ్ ఉంటే బావుండాలని వెయిట్ చేశాను. ఆ సమయంలో లక్కీగా వినయ విధేయ రామ, వెబ్ సిరీస్ దొరికిందని వెల్లడించారు.

    హీరోగా రీలాంచ్ అవుతాను

    హీరోగా రీలాంచ్ అవుతాను

    ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని అనుకోవడం లేదు. మన సినిమా మనమే చేసుకోవాలి. త్వరలో హీరోగా రీ లాంచ్ కాబోతున్నాను. ఛాన్స్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి. నాకు సినిమా తప్ప ఏమీ తెలియదని తెలిపారు.

    తప్పుడు నిర్ణయాల వల్లే...

    తప్పుడు నిర్ణయాల వల్లే...

    నా సినిమాలు పరాజయం కావడానికి కారణం రాంగ్ డిసిషన్స్ తీసుకోవడమే. అప్పట్లో కొన్ని సినిమాలు నాకు నచ్చలేదు. నాన్నగారు, మరికొందరి వల్ల చేయాల్సి వచ్చింది. కొన్ని రాంగ్ స్క్రిప్టుల ఎంపిక కూడా అందుకు కారణమని ఆర్యన్ రాజేష్ స్పష్టం చేశారు.

    అది నా అదృష్టం

    అది నా అదృష్టం

    నా ఫస్ట్ మూవీ మా బేనర్లో చేయాల్సింది.. కానీ రామానాయుడుగారు సురేష్ ప్రొడక్షన్స్‌లో లాంచ్ చేస్తామని చెప్పారు. డాడీకి లైఫ్ ఇచ్చింది రామానాయుడుగారే. ఆయన బేనర్లో నా మొదటి సినిమా రావడం నా అదృష్టం.

    నాన్నగారి వల్ల పైకొచ్చారు, సాయం చేయలేదు, అంతా కమర్షియల్

    నాన్నగారి వల్ల పైకొచ్చారు, సాయం చేయలేదు, అంతా కమర్షియల్

    ఇండస్ట్రీలో సపోర్ట్ ఉన్నాసరే... ఎవరో సాయం చేస్తారని చూడకూడదు. లాభం లేకుండా ఎవరూ చేయరు. నాన్నగారి సపోర్టుతో పైకొచ్చినవారు చాలా మంది ఉన్నారు. ఎవరూ హెల్ప్ చేయలేదు. వాళ్లను తప్పు బట్టడం సరికాదు. ఎవరైనా కమర్షియల్‌గా ఆలోచిస్తారు, నాలుగు డబ్బులు మిగుల్చుకోవాలని చూస్తారు. నాలాంటి సక్సెస్ లేని హీరోతో చేయాలని ఎవరూ అనుకోరు. నేను సినిమా తీయాలన్నా అలాగే చేస్తానని ఆర్యన్ రాజేష్ తెలిపారు.

    English summary
    Tollywood hero Aryan Rajesh said that, No one coming forward to help him after his father EVV Satyanarayana demise. He stated that his father gave an opportunity for newcomers in the Telugu film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X