Don't Miss!
- Finance
SBI Alert: KYC పూర్తి చేయని ఖాతాలకు షాకిచ్చిన SBI.. అకౌంట్ల నుంచి క్యాష్ విత్ డ్రా కావట్లేదు..
- Lifestyle
Diabetic UTI :మధుమేహం UTI ప్రమాదాన్ని పెంచుతుంది, ఈ విధంగా సంక్రమణను నివారించవచ్చు..
- News
Crocodile Attack: బాలుడిని నదిలోకి లాక్కెళ్లిన మొసలి.. ఎక్స్ రే తీయించిన అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే..
- Sports
IND vs SL: వారెవ్వా వాటే కీపింగ్.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన వీడియో
- Technology
అమెజాన్ నకిలీ గిఫ్ట్ కార్డ్‌ల ఫేక్ కాల్ సెంటర్‌ను చేదించిన పోలీసులు!! ఎక్కడనో తెలుసా?
- Automobiles
మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ రేంజ్‌ను అందించనున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77.. త్వరలోనే లాంచ్!
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
PVT04: ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు.. వైష్ణవ్ తేజ్ ఊర మాస్!
మెగా హీరో వైష్ణవ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఇచ్చిన విజయంతో వంద కోట్ల మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత మాత్రం కొండపొలం సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ఆడియన్స్ ను సరికొత్తగా మాస్ సినిమాతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. మొదట లవ్ స్టోరీ ఆ తర్వాత ఒక సోషల్ డ్రామా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడు మాత్రం కంప్లీట్ గా తనలోని మాస్ యాంగిల్ ను చూపించడానికి రెడీ అవుతున్నాడు.
ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వైష్ణవ్ తేజ్ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్టర్ తో ఆకట్టుకున్నాడు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నట్లు చెబుతూ ఎనౌన్స్మెంట్స్ పోస్టర్ ను విడుదల చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ అలాగే ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ లో సౌజన్య సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా ప్రధాన హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న సౌజన్య మరెవరో కాదు. త్రివిక్రమ్ సతీమణి. ఆయన కూడా ఈ సినిమా ద్వారా ప్రొడక్షన్ హౌస్ ను మొదలు పెట్టారు. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తోనే అంచనాలను పెంచేశారు.

ఈ సినిమా కంప్లీట్ గా హై వోల్టేజ్ యాక్షన్ మాస్ సినిమాగా తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది. 'ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు..' అని వైష్ణవి తేల్చి చెప్పిన డైలాగ్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. చూస్తుంటే ఈ సినిమా ద్వారా వైష్ణవ్ మాస్ ఆడియన్స్ లో కూడా ఒక సరికొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ప్రేమకథలు సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు మద్ సినిమాలలో కనిపిస్తుండటం విశేషం. అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు కూడా క్లారిటీ చేశారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.