For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమ్మకు మరో ముగ్గురు పిల్లలు ఉండేవారు.. ఎవరికి తెలియని విషాద విషయాన్ని బయటపెట్టిన పవన్ కళ్యాణ్

  |

  మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. మొదట్లో చిన్న తరహా పాత్రలు చేసుకుంటూ విలన్ గా కూడా విభిన్నమైన శైలిలో అడుగులు వేసాడు. అనంతరం మెల్లగా కథానాయకుడిగా కూడా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగాస్టార్ గా స్టార్ హోదా ను అందుకోవడానికి చిరంజీవి చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ళు కష్టాలను ఎదుర్కొని హీరో అవ్వాలనే కసిని కూడా పెంచుకున్నాడు.

  ఇక అదే తరహాలో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగాస్టార్ తమ్ముడు అయినప్పటికీ ఒక విభిన్నమైన తరహాలో క్రేజ్ ను సెట్ చేసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు అభిమానులకి పెద్దగా తెలియని ఒక విషాద సంఘనపై పవన్ వివరణ ఇచ్చారు. మెగాస్టార్ తల్లికి మొత్తం ఎనిమిది మంది పిల్లలు ఉండేవారని ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తెలియజేశాడు.

  RX 100 Karthikeya కాబోయే భార్య ఎంత అందంగా ఉందొ చూశారా? హీరోయిన్స్ చాలరు!

  ఎన్ని అపజయాలు వచ్చినా అదే క్రేజ్

  ఎన్ని అపజయాలు వచ్చినా అదే క్రేజ్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హోదా గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే. ఎందుకంటే ఏ స్టార్ హీరో అయినా సరే బాక్సాఫీస్ రేంజ్ ను బట్టి వారి స్టార్ హోదాను పెంచుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ కు వరుసగా ఎనిమిది అపజయాలు వచ్చిన కూడా అదే తరహాలో తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు.

  బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా ఒకే తరహా మార్కెట్ క్రియేట్ చేయడం అంటే కూడా అంతా సాధారణమైన విషయం కాదు. ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా నిర్మాతలకు బయ్యర్లకు భారీ వసూళ్లను అందిస్తున్నాయి.

  మెగా అభిమాని పెళ్లికి అల్లు అర్జున్.. వివాహ వేడుకలో సాయిధరమ్ తేజ్, ఇంకా సినీ ప్రముఖులు ఎవరంటే!

  గుణాన్ని బట్టి గౌరవాన్ని ఇచ్చే స్టార్ హీరో

  గుణాన్ని బట్టి గౌరవాన్ని ఇచ్చే స్టార్ హీరో

  మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అడ్డుకున్నాడు. పవన్ కళ్యాణ్ మంచితనం గురించి చాలా మందికి తెలుసు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ఎంతగానో గౌరవిస్తారని చాలామంది నటీనటులు తెలిపారు.

  మనిషి గుణాన్ని బట్టి గౌరవాన్ని ఇచ్చే అతికొద్ది మంది స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఇక సమాజ సేవ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వాలకు విరాళాలు ఇవ్వడానికి చాలా వేగంగా ముందుకు వస్తుంటారు.

  Izabelle Leite: 'వరల్డ్ ఫేమస్ లవర్' బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందంటే.. హాట్ బికినీ ఫొటోస్

  పుట్టినరోజును ఎందుకు సెలబ్రేట్ చేసుకోరు

  పుట్టినరోజును ఎందుకు సెలబ్రేట్ చేసుకోరు

  ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వస్తే అభిమానులకు అది ఒక ప్రత్యేకమైన పండుగ అని చెప్పవచ్చు. పవర్ స్టార్ బర్త్ డే దగ్గరపడుతోంది అంటే ముందుగానే సెలబ్రేషన్స్ మొదలవుతున్నాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ట్యాగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుంది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  ఇక ఆయన గతంలో చేసిన కొన్ని మంచి విషయాల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కువగా పుట్టినరోజును ఎందుకు సెలబ్రేట్ చేసుకోరు అనే విషయంపై కూడా ఒక వివరణ ఇచ్చారు. అలాగే తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా ఒక విషయాన్ని చెప్పాడు.

  మొత్తం ఎనిమిది మంది

  మొత్తం ఎనిమిది మంది

  పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి గురించే అందరికి తెలిసిన విషయమే. ఆమెకు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అని అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నాగబాబు ఆ తర్వాత పవన్ కళ్యాణ్. కూతుర్లు మాధవరావు విజయదుర్గా. అయితే మీరు మాత్రమే కాకుండా అంజనాదేవికి ఒక ముగ్గురు పిల్లలు కూడా ఉండేవారట.

  అంటే మొత్తం ఎనిమిది మంది అని పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే ముగ్గురు చిన్నతనంలోనే చనిపోయారు అని చెబుతూ కుటుంబం ఆర్ధిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉండేదని అన్నాడు.

  ఆర్థిక పరిస్థితుల కారణంగా

  ఆర్థిక పరిస్థితుల కారణంగా

  ఇక ఆర్థిక పరిస్థితుల కారణంగా మొదటి నుంచి కూడా పుట్టినరోజులు జరుపుకోవడానికి వీలు పడేది కాదు. మొదటి నుంచి కూడా బర్త్ డే లకు దూరంగానే ఉండాల్సి వచ్చేది. అయినా ఆ రోజు అమ్మ ఏదో ఒకటి నాకు ఇష్టమైనది వండి పెట్టేది. ఇక నా దృష్టిలో పుట్టినరోజు అంటే మనం బ్రతికున్న ప్రతీ రోజు కూడా ఒక పుట్టిన రోజు.

  ఆ రోజు ప్రత్యేకం కాబట్టే తల్లిదండ్రులకు అలాగే ఆ దేవుడికి దండం పెట్టుకోవడం చాలా ముఖ్యం కాబట్టి అదే చేసేవాన్ని. అంతే గాని హడావుడి గా పుట్టినరోజును పెద్దగా ఏమీ చేసుకునే వాడిని కాదు. అందరిలో తిరగాలి అంటే కూడా కాస్త సిగ్గు గా ఉంటుంది అందుకే ఎక్కువగా ప్రైవసీ లైఫ్ ను ఇష్టపడతాను అది పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా వివరణ ఇచ్చాడు.

  Pawan Kalyan రాజ్యాన్ని ఏలడానికి 6 సూత్రాలు | Bheemla Nayak || Filmibeat Telugu
  రాబోయే సినిమాలు

  రాబోయే సినిమాలు

  ఇక ప్రస్తుతం పవర్ స్టార్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే భీమ్లా నాయక్ వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నాడు. ఇక క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమళ్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేసేందుకు కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

  English summary
  Pawan kalyan about his personal family story
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X