For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bheemla Nayak First Glimpse: చరిత్ర సృష్టించిన పవన్.. ప్రభాస్‌ కంటే రెండితలు.. చిరు రికార్డు బద్దలు

  |

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. పేరుకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడతను. అదే సమయంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా అందుకున్నాడు. ఇక, ఈ మధ్యనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్.. తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు.

  ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం పవన్ కల్యాణ్ కొత్త సినిమా 'భీమ్లా నాయక్' గ్లిమ్స్ వీడియో విడుదలైంది. ఇది టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  ‘భీమ్లా నాయక్'గా వస్తున్న పవన్ కల్యాణ్

  ‘భీమ్లా నాయక్'గా వస్తున్న పవన్ కల్యాణ్

  'వకీల్ సాబ్' అనే మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో వరుసగా ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా 'భీమ్లా నాయక్' అనే సినిమాను చేస్తున్నాడు.

  రాణా దగ్గుబాటి ఇందులో కీలక పాత్రను చేస్తున్నాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు.

  Bheemla Nayak First Glimpse: పవన్ కల్యాణ్ ఊరమాస్ అవతారం.. భీమ్లా నాయక్ టీజర్‌ హైలైట్స్ ఇవే

  సినిమా కథ ఇదే.. ఇద్దరి పాత్రలు హైలైట్‌

  సినిమా కథ ఇదే.. ఇద్దరి పాత్రలు హైలైట్‌

  'అయ్యప్పనుమ్ కోషియం'.. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో తెరకెక్కింది. ఇందులో బీజూ మీనన్ ఎస్సైగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ లోకల్ డాన్‌గా నటించారు. ఇప్పుడిదే కథను తెలుగు పరిస్థితులకు అనుకూలంగా మార్చి 'భీమ్లా నాయక్'గా తెరకెక్కిస్తున్నారు.

  ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇక, దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

  ‘భీమ్లా నాయక్' పాత్ర పరిచయం చేశారుగా

  ‘భీమ్లా నాయక్' పాత్ర పరిచయం చేశారుగా

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌కు 'భీమ్లా నాయక్' అనే టైటిల్ పెట్టారు. దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ వీడియో స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదలైంది. ఇందులో పవన్ కల్యాణ్ పాత్రను కూడా పరిచయం చేశారు. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ వీడియో పవర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రియులందరినీ ఆకట్టుకుంది.

  మరీ ముఖ్యంగా ఇందులో పవన్ కల్యాణ్ మేనరిజం.. మాస్ అవతార్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీనికితోడు ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ దీనికి మరింత వన్నెను తీసుకుని వచ్చింది.

  Pushpa Fight Video: అల్లు అర్జున్ 'పుష్ప' ఫైట్ వీడియో లీక్.. కేసు పెట్టిన కాసేపటికే ఇంకోటి బయటకు!

  ట్రెండ్ సెట్ చేసిన పవన్.. రికార్డులు బ్రేకింగ్

  ట్రెండ్ సెట్ చేసిన పవన్.. రికార్డులు బ్రేకింగ్

  సుదీర్ఘమైన కెరీర్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన మాస్ రోల్స్ చాలా తక్కువనే చెప్పాలి. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్స్‌ను ఏర్పరచుకున్న ఈ స్టార్ హీరో.. పూర్తి మాస్ లుక్‌లో ఎక్కువగా కనిపించలేదు.

  ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా లుంగీ కట్టుకుని ఊరమాస్ గెటప్‌తో కనిపించడంతో 'భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో లక్ష, రెండు లక్షలు, మూడు లక్షలు ఇలా ఎన్నో లైకులు, వ్యూస్‌ను సంపాదించింది. తద్వారా టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది.

  చిరంజీవిని వెనక్కి నెట్టేసిన పవన్ కల్యాణ్

  చిరంజీవిని వెనక్కి నెట్టేసిన పవన్ కల్యాణ్

  ఆగస్టు 15 ఉదయం 9.45 గంటలకు 'భీమ్లా నాయక్' గ్లిమ్స్ వీడియో విడుదలైంది. దీనికి ఆరంభం నుంచి భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఫలితంగా 24 గంటల్లోనే దీనికి 8.49 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

  తద్వారా టాలీవుడ్‌లో ఎక్కువ వ్యూస్ సాధించిన గ్లిమ్స్ వీడియోగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. దీంతో చిరంజీవి పేరిట ఉన్న నెంబర్ వన్ రికార్డు (సైరా: 7.20 మిలియన్) కనుమరుగైపోయింది. ఇక, ఇప్పుడు ఈ జాబితాలో పవన్, చిరు తర్వాత రాధే శ్యామ్ 5.07 మిలియన్లు, స్పైడర్ 4.20 మిలియన్లు, మహర్షి 2.90 మిలియన్లతో టాప్ -5లో ఉన్నాయి.

  నేను ఆ ప్రాబ్లంతో బాధ పడుతున్నా.. చెప్తే హర్ట్ అవుతారని ఆలోచించా: రోజా షాకింగ్ కామెంట్స్

  ప్రభాస్‌కు రెండింతలు.. అదిరిపోయే రికార్డ్

  ప్రభాస్‌కు రెండింతలు.. అదిరిపోయే రికార్డ్

  ఆరంభం నుంచే భారీ స్థాయిలో వ్యూస్‌ను రాబట్టుకున్న 'భీమ్లా నాయక్' గ్లిమ్స్ వీడియోకు లైకులు కూడా అంతే రేంజ్‌లో దక్కాయి. పవన్ కల్యాణ్ సినిమాకు 24 గంటల్లో 728.6K లైకులు వచ్చాయి. ఫలితంగా ఇప్పటి వరకూ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'రాధే శ్యామ్' పేరు మీద ఉన్న 394.4K లైకుల రికార్డు బద్దలైపోయింది. అంటే.. ఈ రెండు సినిమాలకు దాదాపు రెండు రెట్ల తేడా ఉండడం విశేషం. ఇక, ఈ జాబితాలో మూడో స్థానంలో సైరా: నరసింహారెడ్డి 287K, హరిహర వీరమల్లు 219.7K, స్పైడర్ 190K లైకులను అందుకుని టాప్ -5లో స్థానం దక్కించుకున్నాయి.

  టీజర్స్ పరంగానూ టాప్‌-5లో పవర్ స్టార్

  టీజర్స్ పరంగానూ టాప్‌-5లో పవర్ స్టార్

  పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'భీమ్లా నాయక్' మూవీ నుంచి వచ్చింది గ్లిమ్స్ వీడియో అన్న విషయం తెలిసిందే. దీనికి 24 గంటల్లో 728.6K లైకులు వచ్చాయి. ఇదే ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక, టీజర్ల విషయంలో RRR నుంచి వచ్చిన ఎన్టీఆర్ ఇంట్రో వీడియో 'రామరాజు ఫర్ భీం' ఏకంగా 940.3K లైకులు సాధించింది. ఆ తర్వాత పుష్ప టీజర్ 793K, వకీల్ సాబ్ 776.9K, సర్కారు వారి పాట 754.9K లైకులు సాధించాయి. ఇప్పుడీ జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంది 'భీమ్లా నాయక్' వీడియో. మొత్తంగా పవర్ స్టార్ తన మార్కును మరోసారి నిరూపించుకున్నాడు.

  English summary
  Pawan Kalyan, Rana Daggubati Doing Bheemla Nayak Movie Under Saagar K Chandra Direction. Recently Released First Glimpse Video Creates New Record in Tollywood.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X