For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vinodhaya Sitham: మరో రీమేక్‌లో పవన్ కల్యాణ్.. స్వర్గలోకం టూ భూలోకం.. సినిమా కథ తెలిస్తే షాకే!

  |

  మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను కూడా అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని పవర్ స్టార్.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. మధ్యలో రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే ఉన్నాడు. ఇలా పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో రీమేక్ మూవీకి అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అసలేం జరుగుతోంది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

  వకీల్ సాబ్‌గా పవర్ స్టార్ రీఎంట్రీ

  వకీల్ సాబ్‌గా పవర్ స్టార్ రీఎంట్రీ

  సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్‌లో వేణు శ్రీరామ్ తెరకెక్కించాడు. శృతి హాసన్, అంజలి, నివేదా థామస్, అనన్యలు నటించారు. థమన్ దీనికి సంగీతం అందించాడు.

  Bigg Boss Voting Result: ఐదో రోజు మారిన ఓటింగ్.. సన్నీ, షన్నూకు బిగ్ షాక్.. టాప్‌లో ఎవరు ఉన్నారంటే!

  భీమ్లా నాయక్‌గా మారిన స్టార్ హీరో

  భీమ్లా నాయక్‌గా మారిన స్టార్ హీరో


  పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'భీమ్లా నాయక్' అనే సినిమాను చేస్తున్నాడు. రాణా దగ్గుబాటి ఇందులో కీలక పాత్రను చేస్తున్నాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.

  హరిహర వీరమల్లుతో తొలిసారిగా

  హరిహర వీరమల్లుతో తొలిసారిగా

  పవన్ కల్యాణ్ ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందులో జాక్వెలిన్ హీరోయిన్‌గా నటిస్తుందని అంటున్నారు.

  Pushpa Twitter Review: బన్నీ మూవీకి షాకింగ్ టాక్.. మొత్తం అదిరింది కానీ.. ఓవరాల్‌గా ఎలా ఉందంటే!

  హరీశ్‌తో భగత్ సింగ్‌గా మారాడు

  హరీశ్‌తో భగత్ సింగ్‌గా మారాడు

  'వకీల్ సాబ్' మూవీ షూటింగ్ ప్రారంభం అయిన సమయంలోనే పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్‌తో సినిమా చేయబోతున్నాడని ప్రకటన వెలువడింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

  స్టైలిష్ డైరెక్టర్‌తో సినిమా ప్రకటన

  స్టైలిష్ డైరెక్టర్‌తో సినిమా ప్రకటన

  ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇందులో భాగంగానే ఈ స్టార్ హీరో.. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితోనూ ఓ సినిమాను ప్రకటించాడు. రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. వక్కంతం వంశీ రచయితగా పనిచేస్తున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

  Bigg Boss: ఆ కంటెస్టెంట్‌కు ప్రభాస్ ఫ్యామిలీ సపోర్ట్.. స్పెషల్ వీడియోతో కృష్ణంరాజు భార్య సర్‌ప్రైజ్

  మరో రీమేక్‌ మూవీలో పవర్ స్టార్

  మరో రీమేక్‌ మూవీలో పవర్ స్టార్


  ఇప్పటికే చేతి నిండా సినిమాలు.. వరుస రీమేక్‌లతో పుల్ బిజీగా గడుపుతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తాజాగా మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టుకున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇటీవలే తమిళంలో రూపొంది ZEE5లో నేరుగా స్ట్రీమింగ్ అయి.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న 'వినోదయ సీతమ్' సినిమాను పవన్ రీమేక్ చేయబోతున్నాడని తెలిసింది.

  Recommended Video

  Bheemla Nayak : Trivikram Srinivas Charges Rs 15 Crore For Pawan's Movie || Filmibeat Telugu
  స్వర్గలోకం టూ భూలోకం అంటూ

  స్వర్గలోకం టూ భూలోకం అంటూ


  ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని నటించి తెరకెక్కించి 'వినోదయ సీతమ్' మూవీ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తికి స్వర్గలోకానికి వెళ్తాడు. అక్కడ దేవతల అనుగ్రహంతో 60 రోజుల పాటు భూలోకంలో ఉండటానికి పర్మీషన్ పొందుతాడు. ఆ తర్వాత అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నదే ఈ మూవీ కథ. దీన్ని పవన్ హీరోగా సముద్రఖని తీస్తాడని టాక్.

  English summary
  Power Star Pawan Kalyan Recently Doing So Many Film At a Time. Now He Gave Green Signal to Samuthirakani's Vinodhaya Sitham Remake.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X