నిర్ణయం మార్చుకున్న పవన్ కల్యాణ్: దాన్ని పక్కన పెట్టి.. దీన్ని లైన్‌లో పెట్టాడు

చాలా గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజుతో కలిసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వ్యభిచార గృహంలో చిక్కుకున్న యువతులను రక్షించే లాయర్‌గా ఇందులో నటిస్తున్నాడాయన. వాస్తవానికి 2020లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా ప్రభావంతో షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో ఇటీవలే చిత్రీకరణను పున: ప్రారంభించి రెండు రోజుల క్రితం పూర్తి చేశారు.

'వకీల్ సాబ్' షూటింగ్ కంప్లీట్ అవడంతో పవర్ స్టార్ దీని తర్వాత ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఆయన గతంలోనే క్రిష్ జాగర్లమూడితో సినిమా ప్రకటించారు. కానీ, ఇటీవల మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ లైన్‌లోకి వచ్చింది. దీంతో ఈ సినిమానే ముందుగా పూర్తవుతుందని పవన్ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. అయితే, తన సినిమాల విషయంలో పవర్ స్టార్ నిర్ణయం మార్చుకున్నారట. ఇందులో భాగంగానే క్రిష్ మూవీని ముందుగా మొదలెడతారని తెలిసింది.

Pawan Kalyan Krish Movie will Start from this Date

తాజా సమాచారం ప్రకారం.. క్రిష్ సినిమా కోసం జనవరి 4 నుంచి డేట్స్ కేటాయించాడట పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దాదాపు నెల రోజుల పాటు ఇందులో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పిరియాడిక్ జోనర్‌లో తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దీన్ని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. మొదటి షెడ్యూల్‌లోనే పవన్‌తో పాటు ఇతర నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X