Just In
- 35 min ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 1 hr ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 1 hr ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
- 2 hrs ago
చిత్ర సీమలో విషాదం.. నిర్మాత మృతిపై నారా రోహిత్, సుధీర్ వర్మ ఎమోషనల్
Don't Miss!
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- News
రాహుల్ భయ్యా! మీరు వెకేషన్లో ఉన్నారు: ‘మత్స్యశాఖ’ కామెంట్లపై అమిత్ షా సెటైర్లు
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ సెన్సేషనల్ డెసీషన్: గతంలో చూడని లుక్‌తో పవర్ స్టార్.. చిరును ఫాలో అవుతున్నాడా.!
'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు బ్రేకిచ్చి.. రాజకీయాల్లో బిజీ అయిపోయాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కొన్నేళ్ల క్రితం ఓ రాజకీయ పార్టీని స్థాపించిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సత్తా చాటాలని భావించాడు. అయితే, గత ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ అంశం కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా పవర్ స్టార్ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? పూర్తి వివరాల్లోకి వెళితే....

ప్రయోగాలకు తావివ్వని పవన్.. తెలిసిందే చేస్తున్నాడు
రీఎంట్రీ మూవీ అంటే దానిపై అంచనాలు భారీగా ఉంటాయి. దీంతో ఏదైనా సరికొత్త కథాంశంతో వస్తారు. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం దీనికి భిన్నంగా చేస్తున్నాడు. తన రీమేక్‌కు బాలీవుడ్‌లో వచ్చిన ‘పింక్' సినిమా రీమేక్‌ను ఎంచుకున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. నివేదా, అంజలి, అనన్య హీరోయిన్లగా నటిస్తున్నారు.

ఒకదాని తర్వాత ఒకటి... పవన్ కల్యాణ్ ప్లాన్ ఇదే
‘పింక్' రీమేక్‌తో పాటు పవన్ కల్యాణ్ మరో రెండు సినిమాలకు సైతం పచ్చ జెండా ఊపాడు. అందులో ఒకటి క్రిష్ జాగర్లమూడితో కాగా, రెండోది హరీశ్ శంకర్‌తో. ఈ మూడు సినిమాల్లో ఒక దాని తర్వాత మరొకటి పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు ఒక్కో దానికి 30 రోజుల డేట్స్ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.

మూడింటికి కలిపి రూ. 200.. పవన్ రికార్డు
ఈ మూడు సినిమాలకు కలిపి పవన్ కల్యాణ్ రూ. 200 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకుంటున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కేవలం తొంభై రోజుల డేట్స్ ఇచ్చి అంత భారీ మొత్తంలో చార్జ్ చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో తక్కువ వ్యవధిలోనే భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరో అని సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ న్యూస్ వైరల్ చేస్తున్నారు.

లుక్ విషయంలో పవన్ సెన్సేషనల్ డెసీషన్
‘పింక్' రీమేక్‌లో పవన్ కల్యాణ్ నేచురల్ లుక్‌తోనే కనిపించనున్నాడు. అయితే, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో మాత్రం ఆయన సరికొత్తగా దర్శనమివ్వబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం పవన్ విగ్గును వాడబోతున్నాడనేదే ఆ వార్త సారాంశం. పిరియాడిక్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

పవన్.. చిరంజీవిని ఫాలో అవుతున్నాడా.!
క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే విగ్గుతో కనిపిస్తాడని అంటున్నారు. గత ఏడాది వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' కూడా అదే జోనర్‌లో వచ్చింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా విగ్గుతోనే కనిపించారు. ఇప్పుడు పవన్ ఆయనను ఫాలో అవబోతున్నాడన్న మాట.