For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అభిమాని పెళ్లిలో పవన్ కల్యాణ్: ఇదేం క్రేజురా నాయనా.. తల్లిదండ్రులను కూడా కాదని పవర్‌స్టార్‌తో!

  |

  మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. యాక్టింగ్, ఫైట్స్, డైలాగ్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన అతడు.. పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో స్టార్ స్టేటస్‌ను సైతం దక్కించుకున్నాడు.

  ఇలా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానాన్ని కూడా అందుకున్నాడు. ఈ ఫ్యాన్స్ వల్లే పవన్ కల్యాణ్ క్రేజ్ భారీ స్థాయిలో పెరుగుతోంది. అలా మరే హీరోకూ లేనన్ని అభిమాన సంఘాలు అతడి పేరు మీద ఏర్పాటయ్యాయి. ఇక, ఇప్పుడు ఓ ఫ్యాన్ ఏకంగా పవర్ స్టార్‌ను తన వివాహంలో భాగం చేసుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ సంగతులు మీకోసం!

  మూడేళ్ల తర్వాత రీఎంట్రీ.. అదే రేంజ్‌లో వచ్చి

  మూడేళ్ల తర్వాత రీఎంట్రీ.. అదే రేంజ్‌లో వచ్చి

  కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లేందుకు పవన్ కల్యాణ్ సినిమాలకు బ్రేకిచ్చిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. బాలీవుడ్ చిత్రం 'పింక్'కు ఇది రీమేక్‌గా వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది.

  అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిబంధనలకు తోడు కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమా కలెక్షన్లను అంతగా రాబట్టలేకపోయింది. దీంతో 'వకీల్ సాబ్' బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకోలేకపోయింది.

  టూపీస్ బికినీలో రామ్ చరణ్ భామ ఘాటు ఫోజులు: బట్టలు ఉన్నా లేనట్లే మరీ దారుణంగా!

  ‘భీమ్లా నాయక్'గా రాబోతున్న పవన్ కల్యాణ్

  ‘భీమ్లా నాయక్'గా రాబోతున్న పవన్ కల్యాణ్

  'వకీల్ సాబ్' సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా 'భీమ్లా నాయక్' అనే సినిమాను చేస్తున్నాడు. రాణా దగ్గుబాటి ఇందులో కీలక పాత్రను చేస్తున్నాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

  ‘హరిహర వీరమల్లు'గా మారిన పవన్ కల్యాణ్

  ‘హరిహర వీరమల్లు'గా మారిన పవన్ కల్యాణ్

  ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేస్తున్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో పిరియాడిక్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

  పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇది రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

  ఒకేసారి అంత మంది అమ్మాయిలతో ఎఫైర్స్: యాంకర్ ప్రదీప్ పరువు తీసేసిన సీరియల్ నటి

  ‘గబ్బర్ సింగ్' తర్వాత ఆ దర్శకుడితో సినిమా

  ‘గబ్బర్ సింగ్' తర్వాత ఆ దర్శకుడితో సినిమా

  'వకీల్ సాబ్' పట్టాలపై ఉన్న సమయంలోనే పవన్ కల్యాణ్ మరో డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అతడు గతంలో గబ్బర్ సింగ్ వంటి భారీ హిట్‌ను అందించిన హరీశ్ శంకర్. వీళ్లిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందని తెలిసినప్పటి నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  ఇక, ఈ చిత్రం పవన్ కల్యాణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తైంది. కొందరు నటీనటులను కూడా ఎంపిక చేసుకున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

  ఫ్యాన్స్‌ను అలరిస్తూ... ప్రజల కోసం పోరాటం

  ఫ్యాన్స్‌ను అలరిస్తూ... ప్రజల కోసం పోరాటం

  ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొన్నేళ్ల క్రితం 'జనసేన' అనే రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆయనకు భంగపాటు ఎదురైనప్పటికీ.. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు.

  ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ స్టార్ హీరో.. మరోవైపు సమస్యలపై తన గొంతును వినిపిస్తున్నాడు. ఇలా అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఈ రెండు రంగాల్లోనూ ఆయనకు అభిమానులు అండగా నిలుస్తూ.. ప్రతి దాన్ని సక్సెస్ అయ్యేలా పాటు పడుతున్నారు.

  చిరంజీవి బర్త్‌డేకు బన్నీ అందుకే రాలేదు.. పవన్, చరణ్ సహా వాళ్లంతా వేస్ట్: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

  అభిమాని వివాహంలో పవన్ కల్యాణ్ సందడి

  అభిమాని వివాహంలో పవన్ కల్యాణ్ సందడి

  పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనను భగవంతుడిలా ఆరాధించే వాళ్లు కొన్ని కోట్ల మందే ఉన్నారు. పవర్ స్టార్ సినిమా వస్తుందంటే పండుగలా జరుపుకోవడం.. ఆయన అనారోగ్యంగా ఉంటే దేవాలయాల్లో పూజలు చేసుకోవడం.. అంతెందుకు తమ ప్రతి పనిలోనూ ఆయనను పరోక్షంగా భాగం చేస్తూ చాలా మంది ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని ఏకంగా తన పెళ్లి కార్డు, ఫ్లెక్స్‌లో పవన్ కల్యాణ్ ఫొటోలను నింపేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

  తల్లిదండ్రులను కాదని.. పవన్ కల్యాణ్‌ ఫొటో

  తల్లిదండ్రులను కాదని.. పవన్ కల్యాణ్‌ ఫొటో

  సాధారణంగా ఎవరికైనా పెళ్లి అవుతుందంటే.. దానికి సంబంధించిన ఫ్లెక్స్ మీద వధువరులతో పాటు వాళ్ల తల్లిదండ్రుల ఫొటోలు వేయిస్తారు. కానీ, ఖమ్మం జిల్లాకు చెందిన జిక్కుల శ్రీకాంత్ అనే అభిమాని తన తల్లిదండ్రులను కాదని పవన్ కల్యాణ్ ఫొటోను వేయించాడు. అంతేకాదు, ఆహ్వాన పత్రికలో సైతం పవర్ స్టార్ పిక్స్‌ను నింపేశాడు.

  దీన్ని జనసేన పార్టీ గుర్తుతో తయారు చేయించి మరీ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఫలితంగా పవన్‌ను దైవంతో సమానంగా భావించాడతను. దీంతో ఈ అభిమాని చేసిన పని రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తద్వారా అతడికి ఫ్యాన్స్ అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  English summary
  Tollywood Star Hero Pawan Kalyan Now Doing Few Films At a Time. Recently His Fan Use Power Star Photo and Name in His Marriage Invitation Card and Flex.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X