twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబు, వరుణ్ తేజ్‌కు థ్యాంక్స్.. విరాళంపై స్పందించిన పవన్.. క్రిస్మస్ కానుక అంటూ

    |

    జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పార్టీకి అండగా నిలిచేందుకు సోదరుడు నాగబాబు, సినీ హీరో వరుణ్ తేజ్ ముందుకొచ్చారు. జనసేన పార్టీకి వారు భారీ విరాళం ఇవ్వడం అటు సినీ, రాజకీయ పరిశ్రమలోనూ సంచలనం రేపింది. మీడియాలో ప్రముఖంగా మారింది. తనకు అందించిన విరాళంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

     చాలా సంతోషంగా ఉంది

    చాలా సంతోషంగా ఉంది

    జనసేన పార్టీ మీద అభిమానంతోను, పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న కాంక్షతో నా చిన్నన్న నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ పార్టీకి విరాళం అందించినందున చాలా సంతోషంగా ఉంది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

    నాకు ఇచ్చిన విరాళం ఇదే

    నాకు ఇచ్చిన విరాళం ఇదే

    వరుణ్ తేజ్ రూ.1 కోటి, నాగబాబు గారు రూ.25 లక్షలు విరాళం అందజేశారని తెలియచేయడానికి ఆనందంగా ఉంది. నాగబాబు గారు, వరుణ్ తేజ్ అందించిన సహాయం జనసేనకు క్రిస్మస్ కానునగా భావిస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

    వరుణ్ తేజ్ మెగా విరాళం: పవన్ కళ్యాణ్‌కు ఫ్యామిలీ సపోర్ట్, కోట్ల రూపాయలు....వరుణ్ తేజ్ మెగా విరాళం: పవన్ కళ్యాణ్‌కు ఫ్యామిలీ సపోర్ట్, కోట్ల రూపాయలు....

    క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు

    అంతకు ముందు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ఆనందంతో నిండిన ప్రేమను తొటివారికి అందించాలి. ఏసు క్రీస్తు చేసిన బోధనలు మానవాళికి అనుసరణీయాలు కావాలి అని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.

    పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రకటన

    పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రకటన

    దయామయుడైన ఆ క్రీస్తు భూమిపైకి అడుగిడిన క్రిస్మస్ శుభ సమయాన క్రైస్తవ సోదరీ, సోదరులకు, జనసేన సైనికుల తరఫున శుభాకాంక్షలు. క్రీస్తు జీవితంలో, బోధనల్లో ప్రతిఫలించిన సౌభ్రాతృత్వం, సుహృద్భావం, క్షమాగుణం, నిర్మలత్మం అందరూ మెలుగాలని ఆకాక్షింస్తున్నాను అని ప్రకటనలో పేర్కొన్నారు.

    English summary
    Pawan Kalyan responded on Nagababu, Varun Tej's donations for Jana Sena party. Pawan felt happy over donations given by brother and newphew. He said donations are Christamas gift for party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X