వైజాగ్ అమ్మాయితో వివాహం.. మూడు పెళ్లిళ్లపై.. రోజాకు పవన్ కల్యాణ్ దిమ్మతిరిగే కౌంటర్
ఉత్తరాంధ్రలో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రసాభాసగా, వివాదాస్పదంగా మారింది. పవన్ కల్యాణ్‌ను ర్యాలీకి అడ్డంకులు కల్పించడం, అలాగే జనసేన నేతలను అదుపులోకి తీసుకోవడం అత్యంత వివాదాస్పద అంశాలుగా మీడియాలో కనిపించాయి. ఇక ర్యాలీ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను కనిపించకుండా కారులో కూర్చోవాలని పోలీసులు హెచ్చరించడంపై జనసేన తీవ్రంగా స్పందించింది. వైజాగ్‌లో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. తన మూడు పెళ్లిళ్ల వ్యవహారం గురించి ఘాటుగా స్పందించడమే కాకుండా.. సినీ నటి రోజాకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన పెళ్లిళ్లపై పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే?

పెళ్లికి వైజాగ్ అమ్మాయి కావాలి.. కానీ
వైజాగ్‌లో ఉత్తరాంధ్ర జేఏసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన గర్జన కార్యక్రమం సందర్భంగా రోజా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. పెళ్లి చేసుకోవడానికి పవన్ కల్యాణ్‌కు వైజాగ్ అమ్మాయి కావాలి. వైజాగ్‌ను రాజధాని చేయడానికి మాత్రం వ్యతిరేకిస్తున్నాడు అని రోజా కామెంట్ చేసింది. అయితే రోజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ జరిగాయి.

బాంబేలో యాక్టింగ్ నేర్చుకొన్నా..
అయితే వైజాగ్ నోవాటెల్ హోటల్‌లో పవన్ కల్యాణ్ సమావేశం సందర్భంగా.. మీరు వైజాగ్‌లో యాక్టింగ్ నేర్చుకొన్నారు. వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకొన్నారు. వైజాగ్‌లో రాజధాని ఏర్పాటుకు మీరు వ్యతిరేకమా? అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. నేను బాంబేలో యాక్టింగ్ నేర్చుకొన్నాను. అక్కడ రాజధాని పెడుదామా? సంబంధం లేకుండా ఏం మాట్లాడుతారు అని పవన్ ఎదురు ప్రశ్న వేశారు.

ప్రతీ మాటకు మూడు పెళ్లిళ్లు..
ప్రతీ మాటకు నేను మూడు పెళ్లిళ్లు చేసుకొన్నానని వాదన తీసుకొస్తారు. అవును నేను మూడు పెళ్లిళ్లు చేసుకొన్నాను. వారికి ఏదైనా బాధ ఉంటే.. వారిని చేసుకోమనండి. ఎవరు కాదంటారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకొన్నామని వైసీపీ నేతలు అసూయ పడుతున్నారేమో. నా జీవితం అలా రాసిపెట్టి ఉంది. నాకు కుదర్లేదు. దానికి నేను ఏం చేస్తాను అని పవన్ కల్యాణ్ మీడియా అడిగిన ప్రశ్నపై సెటైర్లు వేశాడు.
మూడు చోట్ల రాజధాని పెడుదామా?
నేను మూడు పెళ్లిళ్లు చేసుకొన్నాను. సరే.. మూడు పెళ్లిళ్లు చేసుకొన్న చోట ఆంధ్రా రాజధాని పెడుదామా? ఏం మాట్లాడుతారు..లాజిక్‌లు లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతారు. లాజిక్‌లు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దు. బూతులు మాట్లడకుండా ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలని వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ సూచించారు.

రోజాకు పరోక్షంగా పవన్ కల్యాణ్ చురకలు
నోవాటెల్‌లో మీడియా అడిగిన ప్రశ్నను ఆధారంగా చేసుకొని రోజాకు పవన్ కల్యాణ్ పరోక్షంగా చురకలు అంటించారు అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కాలంలో ప్రధానంగా పవన్ కల్యాణ్‌ను రోజా టార్గెట్ చేసుకొని చవకబారు కామెంట్లు చేస్తున్నారనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నది.
చాలా కాలంగా రోజా చేస్తున్న చవకబారు విమర్శలకు చెక్ పెట్టేలా ఆమె పేరు ఎత్తకుండా పవన్ కల్యాణ్ గట్టిగా సమాధానం ఇచ్చారనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. పవన్ కల్యాణ్ చెప్పిన ఈ మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











