పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ మూవీ.. మరోసారి ప్లాన్ చేంజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ళ తరువాత గ్యాప్ లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎలాంటి సినిమా చేసినా కూడా తనదైన శైలిలో నటించే పవర్ స్టార్ మొదటిసారి డిఫరెంట్ జానర్స్ ను కూడా టచ్ చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో హరిహర వీరమల్లును సెట్స్ పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేశారు. అది చూసిన తరువాత మరోసారి పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ తోనే సునామీ సృష్టించగలడని అర్ధమయ్యింది. ఇక ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత ఏఎమ్.రత్నం ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల వలన షూటింగ్ పూర్తి చేసే ఛాన్స్ కనిపించడం లేదు.

Pawan kalyan upcoming movies release dates update

కేవలం 40% షూటింగ్ మాత్రమే పూర్తయ్యింది. దీంతో హరహర వీరమల్లు సంక్రాంతికి వచ్చే అవకాశం లేదని అర్ధమవుతోంది. ఇక అన్ని అనుకున్నట్లుగా కుదిరితే పవన్ కళ్యాణ్ - రానా నటిస్తున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ 2022 సంక్రాంతికి రావచ్చని సమాచారం. ఈ సినిమాను మొదట దసరా లేదా దీపావళికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు కూడా పరిస్థితులు అనుకూలించేలా లేవని ముందే సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X