సుజిత్‌కు పవన్ కల్యాణ్ స్వీట్ వార్నింగ్.. ఫ్యాన్స్‌ కోసం పట్టుబట్టిన పవర్ స్టార్

దర్శకుడు సుజిత్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం OG. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఓజీ కాన్సర్ట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, నటి శ్రీయారెడ్డి, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకకు భారీ వర్షం అంతరాయం కలిగించింది. అయితే అభిమానుల ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, బాధను అర్ధం చేసుకొన్న పవర్ స్టార్ సుజిత్‌ ఇష్టం లేని పనిని చేయించడం ఫ్యాన్స్‌లో సంతోషాన్ని కలిగించింది. అయితే పవన్ పట్టుబట్టిన విషయం ఏమిటంటే?

థమన్ నేతృత్వంలో కాన్సర్ట్ ప్రారంభించడానికి ఆయన టీమ్ సభ్యులు రెడీ అయ్యారు. ఎప్పుడైతే సుమ వచ్చి వేదిక ఎక్కిందో.. అప్పుడే వర్షం అందుకొన్నది. ఆ తర్వాత ఈవెంట్ నిర్వహించడం కష్టమని తెలిపోయింది. దాంతో తొందర తొందరగా యాక్టర్ల స్పీచ్‌లకు సిద్దం చేశారు. మొదట అర్జున్ దాస్, ప్రియాంక మోహన్ వేదికపైన మాట్లాడారు. అంతలోనే పవన్ కల్యాణ్ స్టేజ్ మీదకు వచ్చారు. పరిస్థితిని అర్ధం చేసుకొని మైక్‌ను చేతిలోకి తీసుకొన్నారు.

Pawan Kalyan s sweet warning to Sujeeth

ఇక తన అభిమానులు ఎంతో కష్టపడి వచ్చి.. నిరాశకు గురి కావొద్దని భావించారు. తనదైన శైలిలో వర్షం మనల్ని ఆపుతుందా? మనల్ని ఎవడ్రా ఏపేది అంటూ డైలాగ్స్ కొట్టి హుషారు పుట్టించారు. మైక్ చేతిలో పట్టుకొని స్పీచ్‌తో ఈవెంట్‌ను తనవైపుకు తిప్పుకొన్నారు. వాషీ వాషి పాటను పాడి అభిమానులను హుషారెత్తించారు. ఇక తన స్పీచ్‌తో అందర్నీ సంతోషంలో ముంచెత్తారు.

అయితే తన ఫ్యాన్స్‌కు మరింత ఉత్సాహాన్ని అందించాలని చూసిన పవన్ కల్యాణ్‌.. వెంటనే సుజిత్‌ను పిలిచి ట్రైలర్‌ను చూపించమని అడిగారు. అయితే ఇంకా ట్రైలర్ వర్క్ పూర్తి కాలేదు. వీఎఫ్ఎక్స్, డీఐ కాలేదు. సెన్సార్ కాలేదంటూ వివరించారు. దాంతో నా ఫ్యాన్స్‌కు డీఐ లేకున్నా సరి చేసుకొంటారు. ముందు ట్రైలర్ వేయండి అంటూ చెప్పారు. అయితే సుజిత్ అందుకు నిరాకరించడంతో మరోసారి సుజిత్‌ను పిలిచి ఎలా ఉంటే.. అలా ట్రైలర్‌ను వేయండి అంటూ చెప్పాడు. దాంతో ట్రైలర్‌ను ఈవెంట్ల్‌లో వేదికపైన ప్రదర్శించారు.

భారీ వర్షంలో తడుస్తూ అభిమానులు ట్రైలర్‌ను చూసి ఆనందించారు. తన అభిమానుల కోసం పట్టుబట్టిన పవన్ కల్యాణ్ తీరుపై ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయ్యారు. తన అభిమానులకు ఇంతకంటే ఏమి ఇవ్వలేను. ఎంతో కష్టపడి వచ్చిన వారికి.. వాళ్లకు ఏం కావాలో ఇవ్వకపోతే ఎలా? ఇలాంటి వైబ్ ఖుషీ టైమ్‌లో చూశాను. మళ్లీ ఓజీకి చూస్తున్నాను అంటూ పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు.

ఓజీ ఈవెంట్‌కు సర్వం సిద్దం కాలేదనే విషయం ట్రైలర్ సిద్దం చేయకపోవడంతో స్పస్టమైంది. వర్షం వస్తుందనే సూచనలు ఉన్నా.. 3 గంటలు ఆలస్యంగా ప్రారంభించడం కూడా పెద్ద లోపంగా మారింది. ఇలాంటి లోపాలను సరిదిద్దడానికి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి.. డిజాస్టర్ అవుతుందని అనుకొన్న ఈవెంట్‌ను బ్లాక్ బస్టర్‌గా మార్చరనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమైంది.

More from Filmibeat

Read more about: pawan kalyan sujeeth og
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X