Just In
Don't Miss!
- News
జగన్ 36 కేసుల కోసం 32 మంది ప్రాణ త్యాగం చేసిన విశాఖ ఉక్కును పణంగా పెట్టారు : అచ్చెన్న ఫైర్
- Sports
బెన్ స్టోక్స్ నన్ను తిట్టాడు.. అందుకే కోహ్లీ భాయ్ జోక్యం చేసుకున్నాడు: మహ్మద్ సిరాజ్
- Lifestyle
ఊబకాయానికి ప్రమాద కారకాలు మీకు తెలుసా? తెలివిగా దీన్ని ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసా?
- Automobiles
మళ్ళీ వివాదంలో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. అసలు విషయం ఏంటంటే?
- Finance
మళ్లీ ఎగిసిపడిన బిట్‌కాయిన్, భారత్‌లో క్రిప్టోకు భలే డిమాండ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘రాధే శ్యామ్’ యూనిట్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్: సంక్రాంతి కానుకలు ఇచ్చిన రెబెల్ స్టార్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. గతంలో ఓ మోస్తరు బడ్జెట్ చిత్రాల్లోనే నటించిన అతడు.. దీని తర్వాత నుంచి పాన్ ఇండియా ప్రాజెక్టులనే చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సుజిత్ దర్శకత్వంలో 'సాహో' అనే సినిమా చేశాడు. ఇది హిందీలో తప్ప అన్ని భాషల్లో నిరాశనే మిగిల్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు 'రాధే శ్యామ్'లో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'రాధే శ్యామ్'. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ దొంగగా కనిపించబోతున్నాడని అంటున్నారు. 1960 దశకం నాటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు పునర్జన్మల నేపథ్యంతో ఇది తెరకెక్కుతోందని అంటున్నారు.

ఇదిలా ఉండగా, తాజాగా 'రాధే శ్యామ్' చిత్ర యూనిట్‌కు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. రిస్ట్ వాచ్‌లు గిఫ్టులుగా ఇచ్చాడట. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన సినిమాలో పని చేస్తున్న టెక్నీషియన్లకు అతడు వాచ్‌లను పంపించాడని సమాచారం. ప్రభాస్ చేసిన ఈ పనికి వాళ్లంతా షాకైపోయారని, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యారని తెలిసింది. ఇక, ఈ మూవీ టీజర్ త్వరలోనే వస్తుందని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించడంతో.. సంక్రాంతికి అది విడుదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, అది జరగక పోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశగా ఉన్నారు.