Just In
- 13 min ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 18 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 43 min ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
అగ్రవర్ణాలకు గుడ్ న్యూస్ చెప్పనున్న సీఎం కేసీఆర్...? 2-3 రోజుల్లో ప్రకటన వచ్చే ఛాన్స్...?
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కండలు కరిగిస్తున్న ప్రభాస్.. ఆ స్టార్ డైరెక్టర్ కోసం మరోసారి బాహుబలిలా...
సాహో మూవీ తర్వాత రాధేశ్యామ్‌ను పట్టాలెక్కించిన యంగ్ రెబల్ స్టార్ వరుస సినిమాలతో 2021 సంవత్సరాన్ని హడలెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాధేశ్యామ్‌ను వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకొంటూనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే సలార్ అనే చిత్రం కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధమవుతున్నారు. గత 10 నెలలుగా ఇంటికే పరిమితమైన ప్రభాస్ రాబోయే సినిమా కోసం పటిష్టంగా తయారయ్యేందుకు రెడీ అయినట్టు సమాచారం. ఆ వివారాల్లోకి వెళితే....

ప్రశాంత్ నీల్ కోసం ప్రభాస్
రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ నటించే సినిమాపై అనేక సందేహాలు, ఊహాగానాలు మీడియాలో షికారు చేశాయి. అయితే కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ కోసం సలార్ సినిమాకు ఒకే చెప్పడం అభిమానుల్లో సంతోషాలు పొంగిపొర్లాయి.

భారీ యాక్షన్ మూవీ కోసం
బాహుబలి తర్వాత అంతటి భారీ యాక్షన్ సినిమాగా రూపొందుతున్న సలార్ మూవీ కోసం ప్రభాస్ ప్రిపేర్ అవుతున్నారు. సలార్ కోసం సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. తన పాత్ర గురించి కొనసాగుతున్న ఊహాగానాలకు తెర దించడానికి మూవీ యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.

సలార్ కోసం ఫుల్ ఫిట్‌గా
ప్రశాంత్ నీల్ రూపొందించే సలార్ సినిమాలో ప్రభాస్ మళ్లీ మాస్ హీరోగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రభాస్ తన ఫిట్‌నెస్‌ను, సిక్స్‌ప్యాక్ మాదిరిగా ఉండే దేహాదారుఢ్యం కోసం జిమ్‌లో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. క్రమం తప్పకుండా వెయిట్ తగ్గించేందుకు కండలు కరిగిస్తున్నట్టు సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

కేజీఎఫ్ 2 తర్వాత సలార్ కోసం
తాజా సమాచారం ప్రకారం.. సలార్ మూవీ జనవరి 2021లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ లోపు కేజీఎఫ్2 సినిమాను పూర్తి చేసుకొని సలార్‌ను తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నట్టు సమాచారం. సలార్ కోసం ప్రభాస్‌ను మానసికంగా, శారీరకంగా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది.

ఆది పురుష్, నాగ్ అశ్విన్ సినిమాలతో
ఇక రాధేశ్యామ్, సలార్ సినిమాల తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించే ఆది పురుష్ చిత్రంలో నటిస్తారు. ఆది పురుష్ తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించే చిత్రం కోసం రెడీ అవుతారు. ఇలా దాదాపు 2022 వరకు ప్రభాస్ ఖాళీ లేకుండా ఫిక్స్ అయిపోవడం తెలిసిందే.