For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రెమ్యూనరేషన్‌లో ప్రభాస్ నేషనల్ రికార్డ్: బడ్జెట్‌లో సగం మనోడికే.. ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపించి.. కొంత కాలంగా పాన్ ఇండియా మార్కెట్‌పై దండయాత్ర చేస్తున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలో టాలీవుడ్‌‌కే పరిమితం అయిన అతడు.. కొంత కాలంగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. తద్వారా తన స్థాయిని పెంచుకుని నేషనల్ స్టార్ అయిపోయాడు. దీంతో అతడి ఫాలోయింగ్ కూడా ఖండాంతరాలు దాటిపోయింది. ఇక, ఇప్పుడు ఈ స్టార్ హీరో వరుస సినిమాలతో హవా చూపిస్తున్నాడు. అదే సమయంలో రెమ్యూనరేషన్‌ను కూడా భారీగా అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ‘రాధే శ్యామ్'గా వస్తున్న ప్రభాస్

  ‘రాధే శ్యామ్'గా వస్తున్న ప్రభాస్

  ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రమే ‘రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  Bigg Boss: అర్ధరాత్రి ఒకే బెడ్‌పై సిరి, షణ్ముఖ్.. లెటర్‌పై రాసి మరీ రచ్చ.. ఏకంగా మీదకు ఎక్కేసి అలా!

  మరో రెండు భారీ చిత్రాలతో బిజీ

  మరో రెండు భారీ చిత్రాలతో బిజీ

  కొంత కాలంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. ఒక పక్క ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని, మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్' అనే మూవీని చేస్తున్నాడు. ఈ రెండింటికి సంబంధించిన షూటింగ్‌లలో వీలును బట్టి పాల్గొంటున్నాడు. ఇందులో ఆదిపురుష్ మూవీ షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తి అయిన విషయం తెలిసిందే.

  పాన్ వరల్డ్ సినిమాలోనూ ప్రభాస్

  పాన్ వరల్డ్ సినిమాలోనూ ప్రభాస్

  నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రభాస్ చేసే మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందనుంది. ఇందులో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తుండగా.. దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. ఇక, సినిమా టైం మెషీన్‌ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్ వినిపించింది. దీంతో బాలయ్య నటించిన ‘ఆదిత్య 369'కు ఇది సీక్వెల్ అంటున్నారు. ఇది వచ్చే ఏడాది మొదలు కాబోతుంది.

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమంత: విడాకుల తర్వాత తొలిసారి ఘాటుగా.. అసలిలా ఎప్పుడూ చూసుండరు

  టాలీవుడ్ డైరెక్టర్‌తో భారీ ప్రాజెక్టు

  టాలీవుడ్ డైరెక్టర్‌తో భారీ ప్రాజెక్టు

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కొంత కాలంగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన 25వ సినిమాను కూడా ప్రకటించాడు. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ఈ సినిమాకు ‘స్పిరిట్' అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎనిమిది భాషల్లో రూపొందిస్తున్నారు. దీన్ని భూషన్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్నారు.

  భారీ బడ్జెట్‌తో రాబోతున్న స్పిరిట్

  భారీ బడ్జెట్‌తో రాబోతున్న స్పిరిట్

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘స్పిరిట్' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కబోతుందని, ఇందులో ప్రభాస్ కాప్ రోల్ చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను దాదాపుగా రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  హాట్ వీడియోతో షాకిచ్చిన మోనాల్ గజ్జర్: చాలా రోజుల తర్వాత ఇంత ఘాటుగా కనిపించడంతో!

  బడ్జెట్‌లో సగం ప్రభాస్‌ కోసమేనట

  బడ్జెట్‌లో సగం ప్రభాస్‌ కోసమేనట

  ‘స్పిరిట్' మూవీ బడ్జెట్ రూ. 300 కోట్లు అయితే.. ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ రూ. 150 కోట్లు అని తాజాగా ఓ న్యూస్ దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అంటే సినిమా బడ్జెట్‌లో సగం మనోడే తీసుకుంటున్నాడన్న మాట. మిగతా నటీనటుల రెమ్యూనరేషన్‌తో పాటు షూటింగ్‌కు మిగిలిన రూ. 150 కోట్లు ఖర్చు చేస్తారని సమాచారం.

  #Spirit : ఆ సినిమా బడ్జెట్‌లో సగం ప్రభాసే తీసుకుంటున్నాడట! || Filmibeat Telugu
   ఇండియాలోనే మొట్టమొదటి స్టార్

  ఇండియాలోనే మొట్టమొదటి స్టార్

  ‘స్పిరిట్' మూవీ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ. 150 కోట్లు రెమ్యూనరేషన్‌గా చార్జ్ చేస్తున్నాడన్న వార్త బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ చర్చనీయాంశం అయింది. దీనికి కారణం ఇండియాలోని ఏ హీరో కూడా ఇప్పటి వరకూ ఇంత మొత్తం తీసుకోకపోవడమే. దీంతో ప్రభాస్ ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటోన్న మొట్టమొదటి ఇండియన్ హీరోగా రికార్డులకెక్కాడు.

  English summary
  Prabhas Now Doing Spirit Movie Under Sandeep Reddy Vanga Direction. Now This Movie Budget and Remuneration Details Was Revealed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X