సినిమాల విషయంలో ప్రభాస్ కీలక నిర్ణయం: టార్గెట్ మాత్రం అదే.. ఒకేసారి రెండు

ఎవరైనా స్టార్ హీరో సినిమా తర్వాత సినిమాను పట్టాలెక్కిస్తారు. కానీ, టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. కొంత కాలంగా ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందంచిన 'బాహుబలి' తర్వాత తన పంథాను పూర్తిగా మార్చుకున్న అతడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొంత మేర బ్యాలెన్స్ ఉండగానే.. మరికొన్ని ప్రాజెక్టులను సైతం పట్టాలెక్కించి అందరికీ షాకిచ్చాడీ పాన్ ఇండియా స్టార్.

ప్రస్తుతం ప్రభాస్.. 'రాధే శ్యామ్'తో పాటు 'సలార్' అనే సినిమాను చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తైంది. రెండోది ప్రారంభించే లోగా కరోనా విజృంభించింది. దీంతో ఆ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాలే కాదు.. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న ఇంకో చిత్రం కూడా ఉంది. అదే 'ఆదిపురుష్'. ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ సినిమాతో అతడు నేరుగా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు జరిగింది. దీనికి కూడా కరోనా సెకెండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడిపోయింది.

Prabhas to do Radhe Shyam First: Then Salaar And Adipurush Do At a Time

ఇక, ఇప్పుడు ప్రభాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఏది ముందు రిలీజ్ అవుతుంది అనే దానిపై తాజాగా క్లారిటీ వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం.. షూటింగ్‌లు పున: ప్రారంభం అయిన వెంటనే అతడు 'రాధే శ్యామ్'ను పూర్తి చేస్తాడట. ఆ తర్వాత 'సలార్', 'ఆదిపురుష్' చిత్రాలను ఒకే సమయంలో చేయబోతున్నాడని తెలిసింది. అయితే, ఈ రెండింటిలో ఏది ముందు వస్తుందన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇందులో 'సలార్'ను వచ్చే సమ్మర్‌లో 'ఆదిపురుష్'ను దసరా సమయంలో విడుదల చేస్తారని మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X