ఆ బాలీవుడ్ మూవీలో ప్రభాస్ రోల్ ఇదే: వాటికి మించేలా ప్లాన్ చేసిన యాక్షన్ డైరెక్టర్
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తోన్నాడు. ఇప్పటికే అతడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తి కాక ముందే మరో మూడు చిత్రాలను ప్రకటించాడు. అందులో ప్రశాంత్ నీల్‌తో 'సలార్', ఓం రౌత్‌తో 'ఆదిపురుష్' అనే సినిమాలను ఇప్పటికే పట్టాలెక్కించేశాడు. అంతేకాదు, వీటికి సంబంధించిన షూటింగ్‌ను కూడా చాలా వరకు పూర్తి చేశాడు. ఈ రెండు చిత్రాల తర్వాత నాగ్ అశ్విన్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు. వీటితో పాటు మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడీ హీరో.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తోనూ ప్రభాస్ సినిమా చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాకముందే.. పలు అంశాలు బయటకు రావడం.. అవి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ హాట్ టాపిక్‌గా మారడం జరిగిపోయాయి. దీంతో ఈ క్రేజీ కాంబోపై అంచనాలు ఏర్పడ్డాయి.

ఇలాంటి సమయంలో ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్రభాస్ రా ఏజెంట్‌గా నటించబోతున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టు కూడా ఫైనల్ అయినట్లు తెలిసింది. ఇందులో ప్రభాస్ పాత్ర హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
గతంలో చేసిన 'బ్యాంగ్ బ్యాంగ్', 'వార్' వంటి యాక్షన్ మూవీలను తలదన్నేలా ప్రభాస్‌తో చేసే సినిమాను రూపొందించబోతున్నాడట సిద్దార్థ్ ఆనంద్. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది తెరకెక్కనుందని.. దీనికి దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌ను అంచనా వేస్తున్నారని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో ప్రభాస్ సరసన కత్రీనా కైఫ్ నటించబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











