తమన్నాపై మోజు పడ్డ చిరంజీవి.. కోరిక తీర్చిన రాంచరణ్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 151వ చిత్రంగా రూపొందిన సైరా నర్సింహారెడ్డి చిత్ర ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా ఊపందుకొన్నాయి. ముంబైలో ఫరాన్ అఖ్తర్, అమితాబ్‌తో కలిసి ప్రమోషన్ నిర్వహించిన చిరంజీవి.. శనివారం చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సినిమాకు సంబంధించిన ప్రముఖ డైరెక్టర్లు, నిర్మాతలు హాజరయ్యారు. తమిళంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బీ చౌదరీ కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ మాట్లాడుతూ చిరంజీవిపై సెటైర్లు వేశారు. చెర్రీ ఏమన్నారంటే..

తమన్నాతో చిరు

తమన్నాతో చిరు

రచ్చ సినిమా సక్సెస్ మీట్‌ హైదరాబాద్‌లో జరిగితే చిరంజీవిగారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా నాన్నగారు మాట్లాడుతూ.. నేను మళ్లీ సినిమాల్లోకి వస్తే తమన్నాతో కలిసి నటిస్తాను అని అన్నారు. అప్పుడు ఏంటి నాన్న తమన్నా మీతో నటించడం ఏమిటి అని అడిగా. ఆమె వయసు.. మీ సీనియారిటీ మ్యాచ్ కాకపోవచ్చు అని అన్నాను. దాంతో ఆ సమయానికి అన్నీ చక్కగా సెట్ అయిపోతాయి. నువ్వే చూడు అంటూ చిరంజీవి గారు అన్నారు.

అందుకే సైరాలో

అందుకే సైరాలో

చిరంజీవి గారు తమన్నాతో కలిసి నటించాలని అన్నారు కాబట్టే.. సైరాలో ఆమెను నాన్న పక్కన హీరోయిన్‌గా తీసుకొన్నాను. తమన్నా పక్కన నాన్న చాలా యంగ్‌గా కనిపించారు. సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరుగుతాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ. చిరంజీవి, తమన్నా జంట తెరపైనా బాగుంది. నా పక్కన కంటే చిరంజీవి పక్కన ఇంకా బాగుంది అని రాంచరణ్ అన్నారు.

రాంచరణ్ ఒప్పుకోలేదు

రాంచరణ్ ఒప్పుకోలేదు

రాంచరణ్ మాట్లాడిన అనంతరం చిరంజీవి కూడా తమన్నా గురించి ప్రస్తావించారు. తమన్నాతో నటించాలని రచ్చ ఫంక్షన్‌లో చెప్పాను. అప్పుడు రాంచరణ్ ఒప్పుకోలేదు. ఖైదీ నంబర్ 150 తర్వాత స్క్రీన్ మీద నన్ను చూసి తన నిర్ణయాన్ని మార్చుకొన్నట్టు ఉన్నారు. అందుకే సైరాలో నాకు మంచి జోడిగా ఉంటుందని తమన్నాను ఎంపిక చేశారు. ఆమెతో కలిసి నటించాలనే కోరికను రాంచరణ్ తీర్చాడు అని చిరంజీవి అన్నారు.

తండ్రి కలను సాకారం చేసే

తండ్రి కలను సాకారం చేసే

సాధారణంగా సినిమా పరిశ్రమలో కొడుకుల కలను సాకారం చేసే తండ్రులను చూశాం. కానీ తండ్రి కలను పూర్తి చేస్తున్న కొడుకును నేను చూస్తున్నాను. ఖర్చుకు వెనుకాడకుండా సైరాను రాంచరణ్ నిర్మించడం ఆయన అభిరుచికి, నాపై ఉన్న ప్రేమకు నిదర్శనం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున రిలీజ్ అవుతున్నది అని చిరంజీవి అన్నారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద రిలీజ్ కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X