Ram pothineni: ఇస్మార్ట్ శంకర్ డబుల్ సెంచరీ.. రామ్ మరో సరికొత్త రికార్డ్!
టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస అపజయాల అనంతరం ఎంతో కసిమీద తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కమర్షియల్ సినిమాల్లో హీరోల పాత్రలను ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రజెంట్ చేసే పూరి జగన్నాథ్ రామ్ పాత్రను కూడా మొదటిసారి ఎవరు ఊహించని విధంగా చూపించాడు. తెలంగాణ యాసలో ఉస్తాద్ అంటూ సరికొత్త కిక్కిచ్చాడు.
సాధారణంగా రామ్ నటించిన ఎ సినిమా అయినా సరే హిందీలోకి డబ్ కావాల్సిందే. హిందీలో టెలివిజన్ ఛానెల్స్ లోనే కాకుండా యూ ట్యూబ్ లో కూడా భారీ రెస్పాన్స్ అందుకుంటాయి. ఉన్నది ఒక్కటే జిందగి బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్కవ్వకపోయినా యూ ట్యూబ్ లో సాలీడ్ వ్యూవ్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమా 200మిలియన్ వ్యూవ్స్ అందుకోవడం విశేషం.

లాక్ డౌన్ లో మన హీరోల డబ్బింగ్ సినిమాలకు వ్యూవ్స్ మిలియన్ల సంఖ్యలో వస్తున్నాయి. ఇక రామ్ పోతినేని మరోసారి 200 మిలియన్ల వ్యూవ్స్ అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. చూస్తుంటే రానున్న రోజుల్లో రామ్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగలడని అనిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ యువ హీరో కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఒక బైలాంగ్యువల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఊర మాస్ కథతో తెరకెక్కుతున్న ఆ సినిమాపై కూడా రామ్ చాలా నమ్మకంతో ఉన్నాడు. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











