‘చిరంజీవికి కొడుకైతే బాగుండు అనుకున్నా... రామ్ చరణ్‌ లైఫ్ చూసి భయమేసింది’

బలమైన సినీ నేపథ్యం ఉన్నప్పటికీ తన కష్టంతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. లవర్ బాయ్‌లా ప్రేమకథలు చేస్తున్నప్పటికీ.. మాస్ ఫాలోయింగ్ కోసం శ్రమిస్తున్నారు రామ్. ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమాలో నటిస్తున్నారు రామ్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ కాగా.. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు. పీ. మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తోన్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా తన జీవితంలోని ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

18 ఏళ్లకే హీరోగా ఎంట్రీ
2002లో అడయాళం అనే తమిళ షార్ట్ ఫిలింతో రామ్ పోతినేని నట జీవితం ప్రారంభమైంది. ఇందులో నటనకు గాను ఆయనకు యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డ్ వచ్చింది. ఈ దశలో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో 2006లో వచ్చిన దేవదాస్ సినిమాతో 18 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఏకంగా సిల్వర్ జూబ్లీ ఆడటం విశేషం. అంతేకాదు.. తొలి సినిమానే సిల్వర్ జూబ్లీ జరుపుకున్న హీరోగా రామ్ చరిత్ర సృష్టించారు.

Ram Pothineni shocking comments on Mega Star Chiranjeevi and Ram charan in Jagapathi Babu s Jayammu Nischayammu Raa Talk show

ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ఫాలోయింగ్
ఆ తర్వాత మస్కా, గణేష్, రామ రామ కృష్ణ కృష్ణ, కందిరీగ, రెడీ, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా, పండగ చేస్కో, నేను శైలజ, శివం, హైపర్, ఉన్నది ఒకటి జిందగీ వంటి సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ దశలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌తో రామ్‌కి మాస్‌లో ఫాలోయింగ్ వచ్చింది. అయితే ఆ తర్వాత చేసిన రెడ్, ది వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు రామ్.

రాత్రికి రాత్రి పోగొట్టుకున్నాం
తాజాగా ఓ ఛానెల్‌లో జగపతిబాబు హోస్ట్‌గా చేస్తోన్న జయమ్ము నిశ్చయమ్ము రా షోకు గెస్ట్‌గా వచ్చిన రామ్ పోతినేని.. తన జీవితం గురించి కొత్త విషయాలు చొప్పుకొచ్చారు. మా అమ్మది హైదరాబాద్, నాన్నది విజయవాడ. 1988లో నేను పుట్టాను, ఆ టైంలో విజయవాడలో క్యాస్ట్ గొడవలు బాగా జరుగుతున్నాయి. మా కుటుంబం అప్పట్లో బాగా రిచ్.. నాన్న జపాన్ వెళ్లి బాగా సంపాదించి ఆ సమయంలోనే ఇండియా వచ్చారు. ఆ గొడవల్లోనే మా కుటుంబం మొత్తం కోల్పోయింది.. రాత్రికి రాత్రి జీరోకు వచ్చేశాం. అక్కడ ఉండటం ఇక కరెక్ట్ కాదని చెప్పి చెన్నైకి మకాం మార్చేశాం. దాంతో నాన్న మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టారు. అందుకే మా నాన్న అంటే ఎంతో గౌరవం. కింద పైకి రావడం వేరు.. కింద నుంచి పైకొచ్చి అంతా పొగొట్టుకుని, ఫ్యామిలీతో వేరే సిటీ వెళ్లిపోయి మళ్లీ కింద నుంచి మొదలుపెట్టారని రామ్ ఎమోషనల్ అయ్యారు.

గోల్డెన్ స్పూన్‌తో పుట్టా
నేను గోల్డెన్ స్పూన్‌తో పుట్టాను.. మొత్తం పొగొట్టుకున్నా. విజయవాడలో ఉన్నప్పుడు నాకు బొమ్మల కోసం పెద్ద గది ఉండేది. మేం చెన్నైలో నివసించిన ఇల్లు అందులో సగం కూడా ఉండేది కాదు. అప్పుడు నాలుగేళ్ల వయసు ఉంటుందనుకుంటా. అలాగే నాన్న జీతం నెలకు 5 వేలు ఉండేది. విజయవాడ లబ్బీపేటలో మా రెండు బిల్డింగ్స్ కలిపి పైన బ్రిడ్జి ఉండేది ... అలాంటి చోటి నుంచి ఓ చిన్న పోర్షన్‌లో అద్దెకు ఉన్నాం. దేవదాస్ సినిమా రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ అయిపోయింది. చిరంజీవి గారు ఓ రోజున దేవదాస్ సినిమా చూస్తానన్నారు. సినిమా హిట్ అయ్యిందని కూల్ అవ్వొద్దు.. ప్రతి సినిమా నీకు ఫస్ట్ సినిమానే, నువ్వొక స్టార్ కిడ్ అయ్యుంటే వేరని చిరంజీవి గారు ఎప్పుడు చెబుతుండేవారని రామ్ తెలిపారు.

చరణ్‌ని చూస్తే భయమేసింది
మనం కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిందేం లేదు.. వచ్చామా? ఎంజాయ్ చేశామా? వెళ్లామా? అన్నట్లుగా ఉంటుంది. చరణ్ ఇంకా ఇండస్ట్రీకి పరిచయం కాలేదు.. ఓ రోజున నేను, చిరంజీవిగారు, చరణ్ పక్కపక్కన కూర్చొన్నాం. అప్పట్లో చరణ్‌ని ఇంట్రడ్యూస్ చేయడం గురించి చిరంజీవి గారి మీద ఎంతో ఒత్తిడి ఉంది. చిరంజీవి గారి తండ్రి నాకు కూడా ఉంటే నాకు కూడా అలాంటి ఇంట్రో వస్తుంది కదా అనుకునేవాడిని. కానీ నాకు అసలు ప్రెజర్ ఉండేది కాదు.. హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నా. చరణ్ జీవితం చూస్తే భయమేసింది. చిరంజీవిగారి అబ్బాయి కాబట్టి ఆయనపై అంత ఒత్తిడి ఉందని అనిపించి జాలీ వేసిందని రామ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రామ్ పోతినేని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X