Ram Pothineni ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా.. RAPO సెన్సేషనల్‌గా!
టాలీవుడ్‌లో విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన పాత్రలతోనే కాకుండా లవర్ బాయ్ ఇమేజ్‌తో ఆకట్టుకొంటున్న యువ నటుడు రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత రామ్ పోతినేని ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. లవర్ బాయ్ ఇమేజ్‌కు తోడుగా మాస్ ఇమేజ్ కూడా జత కలిసింది. ఒక వర్గం ప్రేక్షకులకే కాకుండా అన్ని వర్గాల ఆడియెన్స్‌కు రామ్ పోతినేని చేరువయ్యాడు. ఇలా కెరీర్‌ను గట్టిగా ప్లాన్ చేసుకొంటున్న హీరో రామ్ కెరీర్‌లో మరో ఘనతను సొంతం చేసుకొన్నాడు.
వ్యాపార ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఈ క్రమంలోనే సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు రామ్ పోతినేని అంగీకరించడంతో ఫ్యాన్స్‌లో జోష్ పెరిగింది.

ఆంధ్ర ప్రదేశ్‌లో సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి రామ్ పోతినేని అంగీకరించారు అని ఆ సంస్థ నిర్వాహకులు అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు. గతంలో సీఎంఆర్ సంస్థకు వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేవారు.
అయితే గతంలో ఇలా బ్రాండ్ ప్రోమోషన్స్‌కు, వ్యాపార ప్రకటనలకు యాడ్స్ ఇవ్వడం విషయంలో దూరంగా ఉన్నారు. కానీ మారిన తన ఇమేజ్‌కు తగినట్టుగా, అంతేకాకుండా తన సినిమాలకు ప్రమోషన్ దక్కేలా.. అలాగే సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎదుగుదలలో పాత్ర పోషించాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే వ్యాపార ప్రకటనల్లో కనిపించాలని నిర్ణయం తీసుకొన్న రామ్.. గార్నియర్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం గమనార్హం.
ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే.. భారీ బడ్జెట్ చిత్రాలే కాకుండా... బహుభాషా చిత్రాలను ఎంపిక చేసుకొంటూ గ్రాఫ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుత ఏడాదిలో రెడ్ చిత్రంతో హిట్‌ను సొంతం చేసుకొన్న రామ్.. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో RAPO19 అనే ఇంకా టైటిల్ ఖరారు చేయని చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలో విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications











