For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్: ఈ ఘనతను అందుకున్న ఏకైక హీరోగా సాలిడ్ రికార్డు

  |

  యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, పాటలు ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ టాలీవుడ్‌లోని టాలెంటెడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. టీనేజ్‌లో ఇండస్ట్రీ హిట్ సహా ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. టాప్ హీరోగా మారిపోయాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినప్పటికీ ఏమాత్రం కృంగిపోకుండా ముందుకు సాగాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో వరుసగా విజయాలను అందుకుని కెరీర్‌లో బెస్ట్ స్టేజ్‌లో కొనసాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తారక్ తాజాగా అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  డబుల్ హ్యాట్రిక్‌కు చేరువలో ఎన్టీఆర్

  డబుల్ హ్యాట్రిక్‌కు చేరువలో ఎన్టీఆర్


  పూరీ జగన్నాథ్ రూపొందించిన 'టెంపర్'తో మొదలైన అతడి విజయ పరంపర 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వరకూ కంటిన్యూ అయింది. తద్వారా అతడు డబుల్ హ్యాట్రిక్‌కు చేరువ అయ్యాడు. ఇలా ప్రస్తుత తరంలో ఏ స్టార్ హీరో కూడా వరుసగా ఐదు విజయాలను నమోదు చేయకపోవడం గమనార్హం.

  Love Story Day 1 Collections: చరిత్ర సృష్టించిన నాగ చైతన్య.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా సంచలన రికార్డు

  పాన్ వరల్డ్ చిత్రంలో రియల్ హీరోగా

  పాన్ వరల్డ్ చిత్రంలో రియల్ హీరోగా

  జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇక, ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. ఆలియా భట్, ఒలీవియో హీరోయిన్లు.

  RRR కోసం ఎన్టీఆర్ భారీ సాహసాలు

  RRR కోసం ఎన్టీఆర్ భారీ సాహసాలు

  RRR మూవీ టాలీవుడ్‌ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అందుకే ఈ సినిమా విషయంలో అన్నీ పక్కాగా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. సరైన ఫిజిక్ కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న అతడు.. ఎన్నో విభాగాల్లో శిక్షణ తీసుకున్నాడు. ఓ ఫైట్ సీన్ కోసం పులి బోనులోకి వెళ్లాడతను.

  Bigg Boss: షొలో అర్ధరాత్రి వాళ్లిద్దరి రొమాన్స్.. పెదాలను తాకుతూ కొంటెగా.. అక్కడ కూడా కిస్ చేయమంటూ!

  రామరాజు వదిలిన వీడియోతో రికార్డ్

  రామరాజు వదిలిన వీడియోతో రికార్డ్

  కొద్ది రోజుల క్రితం RRR మూవీ నుంచి 'రామరాజు ఫర్ భీం' పేరిట జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో అతడి క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ టీజర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇది 24 గంటల్లోనే 14.14 మిలియన్ వ్యూస్ సాధించి చరిత్రను తిరగరాసింది. ఇలా ఎన్నో రికార్డులను కొట్టేసింది.

  అలాంటి రికార్డులు.. ఏకైక స్టార్ హీరో

  అలాంటి రికార్డులు.. ఏకైక స్టార్ హీరో

  'రామరాజు ఫర్ భీం' ఆరంభం నుంచే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. ఇది అత్యంత వేగంగా యాభై మిలియన్ వ్యూస్‌ను అందుకున్న వీడియోగా అప్పుడు ఘనతను అందుకుంది. అలాగే, వేగంగా ఒక మిలియన్ లైకులు సాధించిన వీడియోగానూ ఇది అరుదైన రికార్డును సాధించింది. అంతేకాదు, ఇండియాలో ఈ వీడియోకు మాత్రమే ఒక మిలియన్ కామెంట్లు వచ్చాయి.

  Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన హమీదా.. పర్సనల్ ఫొటోలను లీక్ చేసి ఝలక్ ఇచ్చిన ఫ్యాన్స్

  టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన తారక్

  టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన తారక్

  జూనియర్ ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' వీడియో మరో అరుదైన రికార్డును అందుకుంది. అదేమిటంటే.. ఈ వీడియో తాజాగా 1.5 మిలియన్ లైకుల మార్కును చేరుకుంది. దీంతో టాలీవుడ్‌లో ఈ మైలురాయిని చేరుకున్న ఏకైక వీడియోగా ఇది చరిత్రను సృష్టించింది. దీంతో ఎన్టీఆర్ ఖాతాలో మరో అరుదైన ఘనత వచ్చి చేరినట్లైంది. దీనిపై నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

  English summary
  Jr NTR and Ram Charan Doing RRR Movie Under SS Rajamouli Direction. Now This Movie Video Ramaraju for Bheem Gets 1.5 Million Likes in Youtube.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X