మరో మల్టీస్టారర్ సినిమా కోసం సిద్దమైన రానా.. ఈ హీరోతో చేస్తారని ఎవరు ఊహించి ఉండరు!

టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. దర్శకులు కూడా ధైర్యంగా ఇద్దరి హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అంటున్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా ఇటీవల దాదాపు అన్ని ఫ్యామిలీల హీరోలు మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే రీసెంట్ గా రానా మరో మల్టీస్టారర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Recommended Video

Pawan Kalyan - Rana Daggubati MultiStarer : టైటిల్ గా చిరు పాత హిట్ మూవీ, పారితోషికం వివరాలు !
వరుసగా మల్టీస్టారర్ సినిమాలతో

వరుసగా మల్టీస్టారర్ సినిమాలతో

రానా దగ్గుబాటి కెరీర్ మొదటి నుంచి కూడా ఒక కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తున్నాడు. జయాపజయాలను లెక్క చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వీలైనంత వరకు ప్రయోగాత్మకమైన సినిమాలనే చేసిన రానా ఇప్పుడు వరుసగా మల్టీస్టారర్ సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.

బాహుబలి రేంజ్ లో..

బాహుబలి రేంజ్ లో..

బాహుబలి సినిమాలో ఒకసారి ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికి అందులో మాత్రం విలన్ గా మెప్పించాడు. ఇక ఆ సినిమా అనంతరం ఎక్కువ స్థాయిలో అందరి ఫోకస్ పడింది మాత్రం అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ పైనే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు అంటే అంచనాలు అయితే బాహుబలి రేంజ్ లోనే ఉన్నాయి.

ఈ ఏడాదిలో మరో మల్టీస్టారర్

ఈ ఏడాదిలో మరో మల్టీస్టారర్

ఇక 2021లో రానా దగ్గుబాటి సోలోగా వచ్చే సినిమాలతో పాటు రెండు మల్టీస్టారర్ సినిమాలతో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ప్రాజెక్టుతో పాటు మరో యువ హీరోతో కూడా స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ అయితే వస్తోంది. ఇక ఆ హీరోతో రానా మల్టీస్టారర్ సినిమా చేస్తాడని ఎవరు ఊహించి ఉండరు. కథలకు రానా ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తాడో మరోసారి అర్ధమవుతోంది.

మరో హీరోగా విశ్వక్ సేన్

మరో హీరోగా విశ్వక్ సేన్

ఇక ఆ హీరో మరెవరో కాదు.. ఫలక్‌నుమా దాస్ విశ్వక్ సేన్. ఈ ఏడాది 'హిట్' సినిమా ప్రమోషన్ లో కూడా రానా ఈ హీరోకు హెల్ప్ అయ్యాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా రానున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒక యువ దర్శకుడు చెప్పిన ప్రయోగాత్మకమైన కథకు రానా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా విశ్వక్ సేన్ తో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని సమాచారం. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X