For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్ రిచెస్ట్ హీరో బయోపిక్‌లో రానా.. ఆయనకు అన్ని లక్షల కోట్లు ఎలా వచ్చాయి?

  |

  సినిమా ప్రపంచం అనేది డ్రీమ్ లాంటిది. వెండితెరపై బొమ్మ పడకపోతే డొక్కాడని జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఇక సినీ తారల జీవితాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరు ఊహించలేరు. అందుకే చాలా వరకు అవకాశాలు ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవలనే ఆలోచనతో ఉండాలి. ఈ ఆలోచన అందరికి ఉంటుంది కానీ కొందరు మాత్రమే సంక్రమంగా దాన్ని ఫాలో అవుతుంటారు. ఇక ఒకప్పుడు బాధ డబ్బు సంపాదించిన తెలుగు హీరో బయోపిక్ లో రానా దగ్గుబాటి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

  స్టార్ హీరోల ఆస్తుల కంటే చాలా ఎక్కువే

  స్టార్ హీరోల ఆస్తుల కంటే చాలా ఎక్కువే

  ఆ స్టార్ నటుడు మరెవరో కాదు.టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు. ఆయన ఆదాయం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఎన్నో ఆస్తులు వేనకేసుకున్నారు. వాటి విలువ నేటితరం స్టార్ హీరోల ఆస్తుల కంటే చాలా ఎక్కువే ఉంటుంది.సోగ్గాడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం శోభన్ బాబు. అప్పట్లో పోటీగా స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా కష్టపడి చిన్న చిన్న అవకాశాలతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నారు.

  బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లతో..

  బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లతో..

  ముఖ్యంగా అప్పట్లో మహిళల నుంచి అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో నటుల్లో శోభన్ బాబు ఒకరు. ఆయన రింగ్ హెయిర్ స్టైల్ ఒక ట్రెండ్ సెట్ అనే చెప్పాలి. ఎలాంటి సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకునేవి. ఎక్కువగా మొదటి వారం ఆడవాళ్లే ఆయన సినిమాలు చూడటానికి వచ్చేవారు అంటూ క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

  అంత డబ్బు ఎలా వచ్చిందంటే..

  అంత డబ్బు ఎలా వచ్చిందంటే..

  ఇక ఈ స్టార్ హీరో తనకు సినిమాలా ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే కాకుండా వచ్చిన ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ లోనే పెట్టేవారు. చెన్నైలోనే కాకుండా హైదరాబాద్ లో ఆయన భారీ స్థాయిలో భూములను కొనుగోలు చేశారు. అప్పట్లోనే వాటి విలువ వందల కోట్లు ఉండేది ఇక ఆయన చనిపోయే నాటికి 2008లో 80వేల కోట్లకు చేరుకుంది. ఇక ఇప్పుడు వాటి విలువ లక్షల కోట్లు దాటి ఉంటుందని చెప్పవచ్చు.

   శోభన్ బాబు బయోపిక్ లో రానా

  శోభన్ బాబు బయోపిక్ లో రానా

  ఇక చాలా కాలం తరువాత ఆయన బయోపిక్ పై చర్చలు మొదలయ్యాయి. శోభన్ బాబు కథను ఎలాగైనా తెరకెక్కించాలని ఒక సీనియర్ దర్శకుడు నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల రానా దగ్గుబాటితో ఇదే విషయంపై మాట్లాడాని తెలుస్తోంది. ఇక రానా కూడా సానుకూలంగా స్పందించి.. పూర్తి కథ సిద్దమైన తరువాత తన నిర్ణయాన్ని చెబుతానని అన్నాడట.

  శోభన్ బాబు బిజినెస్ మైండ్..

  శోభన్ బాబు బిజినెస్ మైండ్..

  ఇక శోభన్ బాబు బయోపిక్ లో చిన్నతనం నుంచి ఆయన మరణం వరకు కథను రెడీ చేసేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయట. ముఖ్యంగా ఆయన సినిమాల తరువాత బిజినెస్ విషయంలో ఏ విధంగా అడుగులు వేశారు. ముందుగానే ల్యాండ్ బిజినెస్ పైన ఆయన ఎలాంటి అవగాహన పెంచుకున్నాడు. అలాగే ఇప్పుడు అన్ని లక్షల కోట్లు కావడానికి ఎలాంటి దారులు ఏర్పాటు చేశారనే విషయాలను కూడా హైలెట్ చేయనున్నారట.

  క్రమశిక్షణకు మరో అర్ధాన్ని ఇచ్చారు

  క్రమశిక్షణకు మరో అర్ధాన్ని ఇచ్చారు

  స్టార్ హీరోగా ఎదగడానికి శోభన్ బాబు చాలానే కష్టపడ్డారు. మొదట్లో సీనియర్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. నటనతో మంచి గుర్తింపు అందుకొని ఆ తరువాత హీరోగా బిజీ అయ్యారు. కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు సందడి చేస్తున్న సమయంలో శోభన్ బాబు తనదైన శైలిలో హిట్స్ అందుకునేవారు. ఇక శోభన్ బాబు క్రమశిక్షణలో నిబద్దతతో ఉండేవారు. సమయానికి షూటింగ్ కి వచ్చి తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లేవారు.

  ఆయన సలహాతో మురళి మోహన్ కూడా..

  ఆయన సలహాతో మురళి మోహన్ కూడా..

  ఒకప్పుడు జాగ్రత్తగా సంపాదించిన డబ్బును భూమిపై పెట్టుబడి పెట్టిన శోభన్ బాబు తోటి నటీనటులకు కూడా అదే విధంగా సలహా ఇచ్చేవారట. ఆయన సలహాతో మురళి మోహన్ కూడా బాగానే సంపాదించారు. నేటితరం స్టార్ హీరోల ఆస్తుల విలువ శోభన్ బాబు ఆస్తులతో పోలిస్తే వారిది చాలా తక్కువేనట. సౌత్ ఇండస్ట్రీలో శోభన్ బాబే నెంబర్ వన్ ఆస్తిపరుడని కొందరు సినీ ప్రముఖులు కూడా పలు సందర్భాల్లో మాట్లాడారు.

  English summary
  Shobhan Babu is very careful about earning through movies. Only those who invest in the real estate business without making expenses. Most of the land was bought in Madras as well as in Hyderabad. Thousands of acres were purchased mostly in Madras. At the time of his death in 2008, their value had crossed 80 thousand crores. Now it seems to have reached millions of crores.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X