Don't Miss!
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్పై వెటరన్ కామెంట్స్!
- News
తారకరత్న వద్ద జూ ఎన్టీఆర్ - శివన్న- బ్రాహ్మణి: ఎమోషనల్ - విషమంగా..!!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Ramarao On Duty విడుదలకు ముందే సీన్ లీక్.. పొలిటికల్ లీడర్స్ కు రవితేజ వార్నింగ్!
మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఈ శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ అందుకునే అవకాశం కూడా ఉంది. దాదాపు 1000కి పైగా థియేటర్స్ లో రామారావు సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ సభ్యులు చాలా బిజీగా ఉండగా ఒక సన్నివేశం ఊహించిన విధంగా సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.
ఎడిటింగ్ రూమ్ లో నుంచే ఆ సన్నివేశం లీక్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ వీడియోలో రవితేజ రాజకీయ నాయకులకు పవర్ఫుల్ గా వార్నింగ్ ఇస్తున్నట్లు అర్ధమవుతోంది. 'రేయ్ మీరు ఎవరో ఏ పార్టీయో నాకు అనవసరం. ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని గుంతలు తవ్వేస్తాం.. చెరువులు పూడ్చేస్తాం.. అడ్డంగా భూములు కొట్టేస్తాం.. అని దౌర్జన్యంగా చేద్దామనుకుంటే.. అవుట్ అవుట్' అంటూ వారికి వేలు చూపించి మరి రామారావు వార్నింగ్ ఇస్తున్నట్లు అర్థమవుతోంది.

ఈ సినిమాలో రవితేజ ఒక సివిల్ ఆఫీసర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కొన్ని నిజజీవితంలోని సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు శరత్ ఈ సినిమాను తెరపైకి తీసుకు వచ్చినట్లుగా చెబుతున్నాడు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అని రవితేజ కూడా చెబుతున్నారు. ఇక ఈ సినిమా మరి కొన్ని గంటల్లో విడుదలవుతున్న సమయంలో ఇలా హఠాత్తుగా ఒక సీన్ లిక్ అవ్వడంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒక విధంగా ఈ సన్నివేశం సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేస్తుంది అని చెప్పాలి. మరి సినిమా మొత్తం ఇదే ఐ వోల్టేజ్ తో ఉంటుందో లేదో చూడాలి. ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా మొదటి రోజు సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.