యాక్సిడెంట్ తర్వాత కోమాలోకి.. లైఫ్‌పై ఆశ వదులుకొన్నా.. అలాంటి దుర్భర స్థితి.. సాయి ధరమ్ తేజ్
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గతేజ్ తన వంతు బాధ్యతగా హైదరాబాద్‌లోని జలవిహార్‌లో నిర్వహించిన ట్రాఫిక్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్, ట్రాఫిక్ సేఫ్టీపై అవగాహన కల్పించడానికి తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహించిన ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈవెంట్‌లో పోలీస్ ఉన్నతాధికారి సీవీ ఆనంద్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన పోలీస్ శాఖకు 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..
రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్‌పై అవగామణ కార్యక్రమానికి రావడం వెనుక నా వ్యక్దిగతమైన కారణం ప్రధానంగా ఉంది. 2021 సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన నాకు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సమయంలో నేను రెండు వారాలపాటు కోమాలో ఉన్నాను. ఈ విషయాన్ని మీ నుంచి సానుభూతి పొందడానికి చెప్పడం లేదు. ప్రమాదం జరిగితే దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలియజెప్పడానికే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అని సాయి దుర్గ తేజ్ అన్నారు.

నాకు ప్రమాదం సంభవించినప్పుడు నేను హెల్మెట్ ధరించి ఉన్నాను. కాబట్టే ఈ రోజు మీ ముందు ఇలా నిలబడి మాట్లాడుతున్నాను. వాహనం నడిపే ప్రతీ వ్యక్తి హెల్మెట్ ధరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ద్విచక్ర వాహనం నడిపే ప్రతీ ఒక్కరి కుటుంబ సభ్యుడు తమ ఫ్యామిలీ మెంబర్ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించేలా చూసుకోవాలి. ప్రమాదం జరిగితే ఏదైనా జరుగొచ్చు. ఆ సమయంలో నా వాయిస్ పోయింది. చాలా విషయాలు మరిచిపోయాను. జీవితంపై ఆశను వదులు కొన్నాను అని ఎమోషనల్ అయ్యారు.
బైక్ నడిపేటప్పుడు వేగంగా వెళ్లకండి. ప్రతీ ఒక్కరికి అందమైన జీవితం ఉంది. మిమ్మల్ని ప్రేమించే వాళ్లు సంతోషంగా ఉండాలంటే.. వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బైక్, కారు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. కారు నడిపేటప్పుడు సీట్ బెల్డ్ ధరించాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల మీకే కాదు.. ఎదురుగా వచ్చే ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉంటారు అని సాయి దుర్గ తేజ్ చెప్పారు.
బైక్ ప్రమాదం జరిగినప్పడు కిందపడటమే గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్‌లో కళ్లు తెరవడం మాత్రమే గుర్తుంటుంది. యాక్సిడెంట్ తర్వాత బైక్ నడపాలంటే.. భయం వేసింది. ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకొన్న తర్వాత బైక్ తాళాలను నా చేతికి ఇచ్చి ఓ మాట చెప్పింది. బైక్ రైడింగ్ అంటే నీవు భయపడాలని, భయంతో బతకాలని నేను కోరుకోవడం లేదు. ఇంటి ముందు ఖాళీ ప్రదేశంలో బైక్ నడిపి ధైర్యం వచ్చిన తర్వాత రోడ్డుపైకి వెళ్లమని అమ్మ చెప్పింది. ఈ తర్వాత నేను మా ఇంటి ముందు ఖాళీ ప్రదేశంలో హెల్మెట్ ధరించి బైక్ నడుపుతున్నాను అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.
యాక్సిడెంట్ జరిగిన తర్వాత నా ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారింది. ప్రమాదంలో తలకు గాయమైన తర్వాత నేను మాట్లాడటం మరిచిపోయాను. శరీరం బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారింది. పెన్ పట్టుకోవడం కూడా రాలేదు. మామూలు స్థితికి చేరడానికి చాలా సమయం పట్టింది. బైక్ నడపడానికి ఇంకా సమయం పడుతుంది అని సాయిదుర్గ తేజ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











