ఫిదా లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం చాలా గ్యాప్ తీసుకొని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన చిత్రం లవ్ స్టొరీ. ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ తోనే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక టీజర్ కూడా బాగానే వైరల్ అయ్యింది. రీసెంట్ గా వచ్చిన సారంగదరియా పాట కూడా సినిమాపై ఒక్కసారిగా అంచనాల డోస్ ను మరింత పెంచేసింది.
సాయి పల్లవి స్టార్ డమ్ తోనే సినిమాపై బజ్ పెరుగుతున్నట్లు టాక్ వస్తున్నప్పటికీ హీరో నాగ చైతన్యకు కూడా ఇది ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. శేఖర్ కమ్ముల - సాయి పల్లవి కాంబో అన్నప్పుడే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట చైతన్య. ఇక ఇప్పుడు సినిమాకు పెరుగుతున్న బజ్ వల్ల మార్కెట్ స్థాయి కూడా గట్టిగానే పెరగనుందట. ఫిదా సినిమాకు కూడా సాయి పల్లవి వల్లే బజ్ పెరిగింది.
ఫిదా సక్సెస్ వరుణ్ తేజ్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నాగ చైతన్యకు కూడా లవ్ స్టొరీ అలాంటి బ్రేక్ ఇవ్వనుందట. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 40కోట్ల నుంచి 45కోట్ల వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా సినిమా అయితే ఓపెనింగ్స్ తోనే ప్రాఫిట్ జోన్ లోకి వస్తుందని చెప్పవచ్చు. అలా జరిగితే హీరోగా నాగచైతన్య వాల్యూ పెరిగినట్లే. మరి సినిమా టోటల్ గా ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి. సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.
Biopics have become a special attraction in recent times. Some are showing facts up close while others are weaving fictional stories with commercial twists. It seems that the South Indian beautiful heroine soundarya biopic is also coming to the silver screen soon. Clarity is also reported on who will play her role.
Story first published: Monday, March 1, 2021, 20:57 [IST]