Don't Miss!
- News
బాలకృష్ణను వీడని వివాదాలు: కొని తెచ్చుకున్న మరో కాంట్రవర్సీ
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చిన్నవాళ్లం... మమ్మల్ని ఇక్కడే తుంచేయొద్దు: సప్తగిరి ఎమోషనల్ స్పీచ్
సప్తగిరి, వైభవి జోషి జంటగా నటించిన సినిమా వజ్ర కవచధర గోవింద. అరుణ్ పవార్ దర్శకుడు. శివ శివమ్ ఫిలిమ్స్ బేనర్లో నరేంద్ర యడల, జీవీయన్ రెడ్డి నిర్మించగా డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసి జూన్ 14న విడుదల చేశారు. ఈ చిత్రానికి మాస్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.
తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సప్తగిరి మాట్లాడుతూ... మా దర్శకుడు చెప్పినట్లు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ప్రజలకు థియేటర్లకు రావడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా 50 శాతం థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. మేము అనుకున్న బడ్జెట్‌కు టార్గెట్ రీచ్ అయ్యామని మా డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మన్న చెప్పడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

మేము చిన్నవాళ్లం... మమ్మల్ని ఇక్కడే తుంచేయొద్దు
మా సినిమాకు ఫస్ట్ డే మిక్డ్స్ టాక్ వచ్చింది. తర్వాత యావరేజ్ అన్నారు. ఆ యావరేజే మాకు కొండంత బలం. సినిమా యావరేజ్‌గా ఉంది, ప్రతి ఒక్కరూ చూడండి, ఆశీర్వదించండి. చిన్న వాళ్లం.. మీ సపోర్ట్ ఇస్తేనే ముందుకు నగడవగలం, ఇక్కడే తుంచేస్తే ముందుకు నడవలేం. ఇది మనసులో పెట్టుకుని మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని సినిమాలు తీసే విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండని సప్తగిరి తెలిపారు.

ఎ సెంటర్ వాళ్లకు నచ్చుతుంది
రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. ఇలాంటి సమయంలో కూడా మంచి కలెక్షన్లు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. బి, సి సెంటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎ సెంటర్ ప్రేక్షకులు కూడా చూడాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని తప్పకుండా నవ్విస్తాను... అని సప్తగిరి వ్యాఖ్యానించారు.

సెకండాఫ్ లాగి ఉంది... అందుకే 10 నిమిషాల కట్ చేశాం
సినిమా సెకండాఫ్ కాస్త లాగి అయిందంటున్నారు. అందుకే ఒక పది నిమిషాలు ట్రిమ్ చేస్తున్నాం. ఇపుడు సినిమా బావుంటుందని జెన్యూన్‌గా చెబుతున్నాను. మా చిత్రం గ్రాండ్ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను... అంటూ ప్రేక్షకులను రిక్వెస్ట్ చేశారు.

జబర్దస్త్ అవినాష్
జబర్దస్త్ అవినాష్ మాట్లాడుతూ... ప్రేక్షకులకు సినిమా నచ్చితే పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా హిట్ చేస్తారు. వారి నుంచి వచ్చే రివ్యూనే నెం.1 రివ్యూ అని నా ఉద్దేశ్యం. మా సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు.