Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఎమోషన్ గా థియేటర్స్ గేట్లు తెరచిన సత్య దేవ్.. సందడి మొదలైంది
తెలుగులో విబిన్నంగా సినిమాలు చేసే అతికొద్ది మంది యువ హీరోలలో సత్యదేవ టాప్ లిస్ట్ లో ఉంటాడని చెప్పవచ్చు. సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా ఈ హీరో చాలా తెలివిగా ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. బ్లఫ్ మాస్టర్ తోనే ఓ వర్గం యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచేసుకున్నాడు. ఇక లేటెస్ట్ గా తిమ్మరుసు సినిమాతో కూడా అదే తరహాలో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
సినిమాను జూలై 30న రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేసి ఆ ట్రైలర్ కు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో కేవలం డ్రామా మాత్రమే కాకుండా మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నట్లు కొన్ని సీన్స్ ను కూడా వదిలారు. ముఖ్యంగా లిఫ్ట్ ఫైట్ సీన్ సోషల్ మీడియాలో బాగానే బజ్ క్రియేట్ చేసింది. సత్యదేవ్ గత సినిమాలకంటే కూడా ఈ సినిమా కాస్త విబిన్నంగా ఉంది.

ఇక ప్రమోషన్ లో భాగంగా సత్యదేవ్ ఇటీవల ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో దేవి థియేటర్ ను ఎమోషనల్ గా తెరుస్తున్నట్లు ఉంది. చాలా కాలం తరువాత మళ్ళీ థియేటర్స్ వద్ద సందడి మొదలు కాబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. ఇక సినిమాలో సత్యదేవ్ ఒక లాయర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఒక మర్డర్ కేసుని ఎలా చేధించాడు అనేది అసలు కథ. ఇక కేసును చేదించే క్రమంలో హీరో ఎలాంటి సమస్యలను ను సాల్వ్ చేశాడు, శత్రువుల నుంచి ఎదుర్కొన్న అనుభవాలు ఏమిటనేది హైలెట్ గా కానున్నట్లు ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ లో మహేష్ కోనేరు, సృజన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేశాడు. ఇక ప్రస్తుతం సత్యదేవ లూసిఫర్ రీమేక్ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక బాలీవుడ్ లో అయితే అక్షయ్ కుమార్ తో రామసేతు అనే సినిమా చేస్తున్నాడు.
Returning to watching films in theatres with #Thimmarusu⚖️
— Thimmarusu (@ActorSatyaDev) July 29, 2021
Couldn’t have asked for anything special or better! Do watch the film in a theatre near you❤️
Book your Tickets👉🏽 https://t.co/koOe6W1JpQ#ThimmarusuOnJuly30th @ItsJawalkar @sharandirects @smkoneru @nooble451 pic.twitter.com/5pNnR8aMvk