Don't Miss!
- News
కేసీఆర్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయారు!అదిష్టానం ఆదేశాల మేరకే పాదయాత్రలన్న భట్టి!
- Lifestyle
హలో లేడీస్, మీలో ఈ లక్షణాలున్నాయా? హార్మోన్ సమస్యే కావొచ్చు, ఈ చిట్కాలు మీకోసమే
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Sports
India vs Australia అహ్మదాబాద్ టెస్ట్‌కు భారత ప్రధాని
- Finance
Income Tax: ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు.. అలా జంపింగ్ కుదరదా..?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హానీమూన్‌కు వెళ్లాలా? పఠాన్ మూవీ చూడాలా? అభిమాని ప్రశ్నకు షారుక్ సమాధానం ఏమిటంటే?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, అందాల భామ దీపిక పదుకోన్ జంటగా నటించిన పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్దమైంది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం జనవరి 25వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 15 రోజుల క్రితం నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్, ఇండియాలో ఓపెన్ చేయగా.. భారీ స్పందన కనిపించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన అభిమానులతో సోషల్ మీడియాలో షారుక్ మాట్లాడారు. ఈ సందర్భంగా అభిమాని తన మనసులోని కోరికను ఆయన ముందు పెట్టగా.. షారుక్ ఖాన్ చెప్పిన విషయాలు, షారుక్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ వివరాల్లోకి వెళితే..

ఒడిదుడుకుల్లో షారుక్ ఖాన్ లైఫ్
షారుక్ ఖాన్‌కు కొన్నేండ్లుగా గడ్డు పరిస్థితి కనిపిస్తున్నది. ఎన్నడూ లేని విధంగా షారుక్ ఖాన్ కెరీర్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. గత తొమ్మిదేళ్లుగా ఆయన హిట్ కొట్టిన దాఖలాలు లేవు. అది కాకుండా కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ లాంటి అంశాలు ఆయనను కుంగదీశాయి. అలాంటి సమయంలో హిట్ చేజిక్కించుకొనేందుకు పఠాన్ మూవీతో షారుక్ సిద్దమయ్యారు.

వివాదంలో బేషరమ్ సాంగ్
పఠాన్
సినిమాతో
మళ్లీ
స్టార్
డమ్‌ను
పరుగులు
పెట్టించాలనే
ఉద్దేశంతో
షారుక్
ఉన్నాడు.
పఠాన్
సినిమా
ట్రైలర్
విడుదల
చేయగా..
బేషరమ్
రంగ్
సాంగ్
వివాదం
రేపింది.
ఈ
సినిమాలో
ఉపయోగించిన
దుస్తులు,
దీపిక
పదుకోన్
వేసుకొన్న
బికినీలు,
పాటలో
ప్రదర్శించిన
హావభావాలపై
తీవ్ర
అభ్యంతరాలు
వ్యక్తమయ్యాయి.

భారీ అడ్వాన్స్ బుకింగ్
పఠాన్
వివాదాల
మధ్య
నలుగుతూనే
అన్ని
వర్గాల
నుంచి
భారీ
స్పందన
కూడగట్టుకొన్నది.
అడ్వాన్స్
బుకింగ్
అనూహ్యమైన
స్పందన
లభింంచింది.
ఓవర్సీస్‌తోపాటు
స్వదేశంలో
భారీ
వసూళ్లను
రాబట్టింది.
ఇప్పటికే
ఈ
చిత్రం
4
లక్షల
టికెట్లు,
20
కోట్లకుపైగా
వసూళ్లను
అడ్వాన్స్
బుకింగ్
రూపంలో
రాబట్టింది.

హానీమూన్‌కు వెళ్లాలా? లేక..
విడుదలకు
ముందే
పఠాన్
బ్లాక్
బస్టర్
టాక్
అందుకొంటున్న
సమయంలో
షారుక్
ఖాన్
తన
అభిమానులతో
ముచ్చటించారు.
#AskSRK
అంటూ
ట్విట్టర్‌లో
ప్రశ్నోత్తరాల
కార్యక్రమాన్ని
నిర్వహించారు.
అయితే
ఆ
సందర్భంగా
షారుక్‌కు
అభిమాని
ప్రశ్న
వేస్తూ..
ఇటీవల
అంటే
గతవారం
నా
పెళ్లి
జరిగింది.
నేను
హానీమూన్‌కు
వెళ్లాలా?
లేదా
పఠాన్
చూడాలా?
అని
అడిగాడు.
అయితే
అభిమాని
అడిగిన
హానీ
మూన్
ప్రశ్నకు
షారుక్
ఖాన్
తనదైన
శైలిలో
సమాధానం
చెప్పడంతో
నెటిజన్ల
నవ్వుల్లో
మునిగిపోయారు.

షారుక్ సమాధానం ఏమిటంటే?
తన
అభిమాని
అడిగిన
ప్రశ్నకు
షారుక్
సమాధానం
ఇస్తూ..
నీ
పెళ్లి
జరిగి
వారం
రోజులు
అయిందని
చెప్పావు.
అయితే
ఇప్పుడు
భార్యతో
కలిసి
పఠాన్
సినిమా
చూడు.
ఆ
తర్వాత
హానీమూన్‌కు
వెళ్లి
భార్యతో
కలిసి
ఎంజాయ్
చేయి
అని
అన్నాడు.
దాంతో
షారుక్
సమయస్పూర్తితో
కూడిన
జవాబుకు
ఆనందంలో
మునిగిపోయారు.
షారుక్
సలహాను
పాటించు
అంటూ
అభిమానికి
నెటిజన్లు
చెప్పడం
గమనార్హం.