twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    1000 కోట్లు టార్గెట్ కాదు.. సినిమాకు కులమతాలు లేవు.. కించపరచలేదు.. పఠాన్ సక్సెస్ మీట్‌లో షారుక్ ఎమోషనల్

    |

    పఠాన్ చిత్రం భారీ విజయంవైపు దూసుకెళ్తున్నది. షారుక్ ఖాన్‌కు 9 సంవత్సరాల తర్వాత భారీ సక్సెస్ దక్కడమే కాకుండా హిందీ సినిమా చరిత్రను తిరగరాసే కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో యష్ రాజ్ ఫిలింస్ ముంబైలో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో షారుక్ ఖాన్ ఉల్లాసంగా, ఉత్సాహంగా మాట్లాడారు. దేశానికి సంస్క‌తి, సినిమా గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు. కులాలు, మతాలకు అతీతంగా యువత ఉండాలని షారుక్ చెప్పారు. పఠాన్ సక్సెస్ మీట్‌లో షారుక్ ఖాన్ మాట్లాడుతూ..

    విలన్ పాత్రలు వేస్తే చెడ్డవారు కాదు..

    విలన్ పాత్రలు వేస్తే చెడ్డవారు కాదు..

    సినిమాను ప్రేమించే వాళ్లకు నేను ఒక్కమాట చెప్పాలని అనుకొంటున్నాను. నాకు 57 సంవత్సరాలు. కాబట్టి మీకు నేను ఏదైనా చెప్పగలనని భావిస్తున్నాను. మా నుంచి మంచి, చెడులు జరుగుతుంటాయి. ఎవరైనా సినిమాలు తీస్తుంటారు. దక్షిణాది, ఉత్తరాది, విదేశాల్లో ఎవరు సినిమాలు తీసినా.. సోదరభావం, ప్రేమను, నిజాయితీని పంచడానికే ప్రయత్నిస్తారు. మేము విలన్ పాత్రలు వేసినా.. మరో పాత్రలు వేసిన క్యారెక్టర్ కోసమే. నేను డర్, బాజీఘర్ సినిమాలో విలన్‌గా కనిపించాను. పఠాన్‌లో జాన్ అబ్రహం విలన్ పాత్ర చేశాడు. అంత మాత్రాన విలన్లు కాము. మిమ్మల్ని సంతోషంలో ముంచడానికే.. మేము పాత్రలు చేస్తాం. ఒకరి సెంటిమెంట్లను దెబ్బ తీయడానికి కాదు. ప్రతీ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవద్దు అని షారుక్ ఖాన్ అన్నారు.

    సినిమాకు కులమతాలు లేవు

    సినిమాకు కులమతాలు లేవు

    సినిమాకు కులం, మతాలు లేవు. సినిమా అంటే అమర్; అక్బర్, ఆంథోని అంటూ సమైక్యతను చాటే సాధనం. పఠాన్ సినిమా విషయానికి వస్తే.. దీపిక పదుకోన్ అమర్, నేను షారుక్ ఖాన్ అక్బర్‌ను, జాన్ అబ్రహం.. ఆంథోని.. మేము ముగ్గురం కలిస్తే అమర్, అక్బర్, ఆంథోని అంటూ మూడు మతాలకు (హిందూ, ముస్లిం, క్రిస్టియన్) చెందిన మేము సినిమా కోసం భాగమయ్యాం అని షారుక్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యారు.

    మీ ప్రేమను పొందడానికే..

    మీ ప్రేమను పొందడానికే..

    మాకు కులాలు, మతాలు, సంస్క‌ృతి పరంగా మాకు ఎలాంటి విభేదాలు లేవు. మీరంటే మాకు ప్రేమ. అందుకే మీ నుంచి ప్రేమను పొందేందుకు సినిమాలు మీ కోసం తీస్తుంటాం. మీ నుంచి ప్రేమను పొందాలని ఆరాటపడుతుంటాం. మేము మీ ప్రేమను పొందాలనే ఆకలితో అలమటిస్తుంటాం. అంతేకానీ.. మేము కలెక్షన్లు, వసూళ్లను పట్టించుకోం అని షారుక్ ఖాన్ అన్నారు.

    కలెక్షన్లు, వసూళ్లు తాత్కాలికం

    కలెక్షన్లు, వసూళ్లు తాత్కాలికం


    పఠాన్ సక్సెస్ మీట్‌లో మా యూనిట్ సభ్యుడు మాట్లాడుతూ.. 200 కోట్లు, 500, 1000 కోట్ల కలెక్షన్లు అంటూ గొంతు చించుకొంటున్నాడు. అయితే అలాంటి వాటితో సంతృప్తి లభించదు. మీరు సినిమా చూసి ప్రేమను, అభిమానాన్ని, సంతోషాన్ని పొందుతారు. మీకు మేమిచ్చే సంతృప్తితోనే మాకు ప్రేమ లభిస్తుంది. అంతకంటే గొప్ప బహుమానం మాకు అవసరం లేదు. కలెక్షన్లు, బాక్సాఫీస్ రిపోర్టులు తాత్కాలికం అని షారుక్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు.

    ఎవర్నీ కించపరచడానికి సినిమా తీయలేదు

    ఎవర్నీ కించపరచడానికి సినిమా తీయలేదు


    అందమైన మనదేశంలో ఎన్నో కథలు ఉన్నాయి. ప్రాచీన భారతానికి సంబంధించిన కథలను చెప్పాలనేది సినిమా. మారుతున్న యువత అభిరుచికి తగినట్టుగా విభిన్నమైన రీతిలో, వివిధ మార్గాల్లో చెప్పాలని ప్రయత్నిస్తున్నాం. అంతేకానీ.. ఈ దేశంలో ఏ ఒక్కరిని కించపరిచే విధంగా మేము సినిమా తీయలేదు. మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలి అని షారుక్ ఖాన్ అన్నారు.

    English summary
    Bollywood Super Star Shah Rukh Khan gets emotional at Pathaan's Success meet at mumbai. He said that, We are never criticise anybody. Our motto of film making just for love of Audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X