Shah Rukh Khan 20 మంది ఫ్యాన్స్‌కు ఫైవ్ స్టార్ హోటల్‌లో ఆతిథ్యం.. కొండంత అభిమానాన్ని చాటుకొన్న బాద్షా
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన అభిమానులకు కొండంత సంతోషాన్ని పంచారు. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ సినిమా కోసం చెన్నైకి వచ్చిన షారుక్ ఖాన్ తన అభిమానులను కలుసుకొన్నారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎంపికైన కొందరు లక్కీ ఫ్యాన్స్‌కు చెన్నైలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌లో షారుక్ గదులను కేటాయించి వారిని కలుసుకొన్నారు. సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేసుకోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. మా కోసం ఇద్దరు బట్లర్లను మా కోసం షారుక్ కేటాయించారని అభిమానులు తెలిపారు.

చెన్నైలో జవాన్ షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ఆయన మేనేజ్‌మెంట్ టీమ్‌ను అభిమానులు కలుసుకొన్నారు. షారుక్ ఖాన్‌ను కలుసుకోవాలని ఉందని ఫ్యాన్స్ కోరగా.. ఏకంగా షారుక్ ఖాన్ తన అభిమానులకు విలాసవంతమైన అతిథ్యం ఇచ్చారు. జవాన్ షూట్ సందర్భంగా ఎంపిక చేసిన కొందరు అభిమానులకు ఫైవ్ స్టార్ హోటల్‌లో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు.
షారుక్ ఖాన్‌తో అభిమానులు కలుసుకొన్న ఫోటోలను చెన్నైకి చెందిన ఫ్యాన్ క్లబ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. దాదాపు 20 మంది అభిమానులకు ఆతిథ్యం ఇచ్చారు. మాకు ఈ గౌరవాన్ని కల్పించిన షారుక్ ఖాన్‌కు థ్యాంక్స్ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











