అలనాటి సూపర్‌స్టార్, బాలీవుడ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ 98వ జన్మదినోత్సవం సందర్భంగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలిపారు. వందేళ్ల పుట్టిన రోజును జరుపుకోవాలని ఆయన శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు. తనకు ఇష్టమైన దిలీప్ సాబ్ జన్మదినం సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ భావోద్వేగంగా స్పందించారు.
షారుక్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. తన వ్యక్తిత్వంతోనే ప్రపంచానికి స్పూర్తిని అందించిన అద్బుతమైన ఒకే వ్యక్తి దిలీప్ కుమార్. అలాంటి మహోన్నతుడు దిలీప్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ సందేశంతోపాటు ఆయనతో దిగిన ఫోటోలను షేర్ చేశారు.
దిలీప్ కుమార్‌తో ఉన్న అనుబంధం ఎప్పడూ కొత్త అనుభూతికి గురిచేస్తాయి. ఆయనను కలిసిన ప్రతీసారి మధురానుభూతికి గురవుతాను. తనకు సంబంధించిన వ్యక్తిగా నన్ను చూసుకొంటాడు. దిలీస్ సాబ్ లాంటి వ్యక్తి ప్రేమను సంపాదించుకోవడం గర్వంగా ఉంది అంటూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో షారుక్ ఖాన్ వెల్లడించారు.
దిలీప్ కుమార్ జన్మదినం అంటే ప్రతీ ఒక్కరికి ప్రత్యేకమైనది. ఆయన జన్మదిన వేడుకలను భార్య సైరా భాను ప్రత్యేకంగా జరుపుకొంటారు. అయితే ఈ ఏడాది దిలీప్ కుమార్ కుటుంబ జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే కరోనా కారణంగా దిలీప్ కుమార్ సోదరులిద్దరూ మరణించడంతో విషాదంలో మునిగిపోయారు. అంతేకాకుండా ఆయన ఆరోగ్యం కూడా అంతంతగా ఉండటంతో ఈ ఏడాది బర్త్ డే వేడుకలు జరుపకూడదని భావించారు.
Bollywood Super Star Shah Rukh khan wishes Veteran actor Dilip Kumar on his birthday. Shah Rukh posted in instagram that, To the one and only, who amazed and inspired the world by just being himself... Wishing the legendary #DilipKumar a very Happy Birthday. I cherish and remember every time we’ve met in vivid detail and you have always loved me like your own. Love you tooo much. Have a good one Dilip Sahib.
Story first published: Friday, December 11, 2020, 18:54 [IST]