For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాని సినిమా వల్ల స్టార్ హీరోకు ప్రమాదం.. ముఖానికి 13 కుట్లు పడడంతో షూట్ వాయిదా.!

  By Manoj Kumar P
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరొందాడు నేచురల్ స్టార్ నాని. అతడు నటించిన చిత్రాల్లో 'జెర్సీ' ఒకటి. అప్పటి వరకు వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో నానిని ఈ సినిమా హిట్ ట్రాక్ ఎక్కించింది. అంతేకాదు, ఇందులో అతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే, కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా దుమ్ము దులిపేసింది. దీంతో 'జెర్సీ'ని అన్ని భాషల్లో రీమేక్ చేయడానికి చాలా మంది ఫిల్మ్ మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా హిందీ రీమేక్ కూడా స్టార్ట్ అయింది. అంతలోనే భారీ ప్రమాదం జరిగింది.

  అందుకే ఈ సినిమాకు భారీ డిమాండ్

  అందుకే ఈ సినిమాకు భారీ డిమాండ్

  తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ‘జెర్సీ' రీమేక్ చేయడానికి చాలా మంది క్యూ కడుతున్నారన్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఈ సినిమా క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కడమే. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతోనే రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. మన దేశంలో క్రికెట్ ప్రేమికులు చాలా మంది ఉండడమూ ఒక కారణమే.

  ఇక్కడి వాళ్లే అక్కడకు తీసుకెళ్తున్నారు

  ఇక్కడి వాళ్లే అక్కడకు తీసుకెళ్తున్నారు

  నాని హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో దీని హిందీ రీమేక్ హక్కులను కూడా తెలుగు ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్ రాజు తీసుకున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మాతృకను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. ఇందులో ‘కబీర్ సింగ్' హీరో షాహీద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

   అంతా పర్‌ఫెక్ట్‌గా ఉండాలని ఇలా ప్లాన్

  అంతా పర్‌ఫెక్ట్‌గా ఉండాలని ఇలా ప్లాన్

  ‘కబీర్ సింగ్' సినిమా కోసం షాహీద్ కపూర్ ఎంతగానో శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా ప్రొఫెషనల్ క్రికెట్‌ ప్లేయర్‌గా కనిపించడం కోసం అతడు దాదాపు రెండు నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకోసం కొందరు ఒరిజినల్ కోచ్‌ల సహకారం తీసుకుంటున్నాడు. దీంతో ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది.

  రష్మిక మందన్నా ఇలా చేసిందేంటి.?

  రష్మిక మందన్నా ఇలా చేసిందేంటి.?

  ఇటీవల ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. జెర్సీ హిందీ రీమేక్ కోసం మొదట రష్మిక మందన్నాను హీరోయిన్‌గా అనుకున్నారు. తెలుగు నిర్మాతలే కావడంతో ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారు. మొదట ఇందులో చేస్తానని ఆమె ఒప్పుకున్నప్పటికీ, తర్వాత అర్థాంతరంగా దీని నుంచి తప్పుకుంది.

   సినిమా షూటింగ్‌లో స్టార్ హీరోకు ప్రమాదం

  సినిమా షూటింగ్‌లో స్టార్ హీరోకు ప్రమాదం

  తాజాగా ఈ సినిమా షూటింగ్ పంజాబ్ రాష్ట్రంలోని మొహాలిలో జరుగుతోంది. అక్కడి ప్రఖ్యాతి క్రికెట్ స్టేడియంలో దీనికి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ బౌలర్ వేసిన బంతి హీరో షాహీద్ కపూర్‌ గడ్డానికి తగలింది. దీంతో అతడి కింది పెదవి సహా గడ్డం పగిలిపోయింది. వెంటనే అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

  ముఖానికి 13 కుట్లు పడడంతో షూట్ వాయిదా.!

  ముఖానికి 13 కుట్లు పడడంతో షూట్ వాయిదా.!

  ప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర రక్తస్రావం అయిందని, దీంతో భయపడిపోయామని చిత్ర యూనిట్ సభ్యుల్లోని ఒకరు వెల్లడించారు. ఆస్పత్రిలో వైద్యులు షాహీద్‌కు పదమూడు కుట్లు వేశారని చెబుతున్నారు. అంతేకాదు, అతడికి కొన్ని వారాల విశ్రాంతి కూడా అవసరమని సూచించినట్లు తెలిపారు. దీంతో ఈ సినిమా షూటింగ్ కొద్ది నెలల పాటు వాయిదా పడింది.

  English summary
  Jersey is a 2019 Indian Telugu-language sports drama film written and directed by Gowtham Tinnanuri and is produced by Suryadevar Naga Vamsi under his production banner Sithara Entertainments. Jersey is the official Hindi remake of hit Telugu film of the same name.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X