For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ కొత్త మూవీపై షాకింగ్ అప్‌డేట్: ఒక్కటి కూడా లేకపోతే ఆడియెన్స్ జీర్ణించుకుంటారా.!

  By Manoj
  |

  'ఈశ్వర్' అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. 'బాహుబలి' తర్వాత యూనివర్శల్ స్టార్‌గా మారిన అతడు.. వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీని సైతం లైన్‌లో పెట్టేశాడు. తెలుగులో ఏ హీరోకూ సాధ్యం కాని ప్రాజెక్టులతో దూకుడు చూపిస్తోన్న ప్రభాస్‌.. తెలుగు ప్రేక్షకులకు భారీ షాక్ ఇవ్వబోతున్నాడట. ఇంతకీ ఏమైంది.? పూర్తి వివరాల్లోకి వెళితే....

   యూనివర్శల్ స్టార్‌కు అక్కడ ఫస్ట్ హిట్

  యూనివర్శల్ స్టార్‌కు అక్కడ ఫస్ట్ హిట్

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి' తర్వాత ప్రభాస్ క్రేజ్ విశ్వవ్యాప్తం అయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో సైతం మనోడు హాట్ టాపిక్ అయ్యాడు. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, తన తదుపరి చిత్రం ‘సాహో'ను హిందీలో రిలీజ్ చేశాడు ప్రభాస్. మిగిలిన అన్ని భాషల్లో నిరాశ పరిచిన ఈ చిత్రం.. అక్కడ మాత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

   రాధతో కలిసి రెడీ అవుతోన్న శ్యాముడు

  రాధతో కలిసి రెడీ అవుతోన్న శ్యాముడు

  ‘సాహో' తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘రాధే శ్యామ్'. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు, ప్రియదర్శీ సహా పలువురు ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు.

  ఒక్కసారిగా జోనర్ మార్చిన రెబెల్ స్టార్

  ఒక్కసారిగా జోనర్ మార్చిన రెబెల్ స్టార్

  వరుసగా పవర్‌ఫుల్ సినిమాల్లో నటిస్తూ తన మార్కెట్ పెంచుకుంటున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అయితే, ‘రాధే శ్యామ్' కోసం అతడు సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నాడు. ఈ మూవీలో అతడు రొమాంటిక్ యాంగిల్‌ను చూపించబోతున్నాడట. 1960వ దశకం నాటి ప్రేమకథతో ఈ మూవీ తెరకెక్కుతోందని అంటున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

  వాళ్లను నిరాశ పరుస్తోన్న రాధే శ్యామ్

  వాళ్లను నిరాశ పరుస్తోన్న రాధే శ్యామ్

  ప్రభాస్ సినిమా అంటే రెండు మూడేళ్లు కంపల్సరీ అన్నట్లుగా ముద్ర పడిపోయింది. ఈ మధ్య అతడు నటించిన చిత్రాలన్నీ చాలా ఆలస్యం అవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ‘రాధే శ్యామ్' విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. దీనికితోడు కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ మూవీ షూట్ మరింత లేట్ అయింది. దీంతో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ యూనిట్‌పై గరంగా ఉన్నారు.

  ప్రభాస్ కొత్త మూవీపై షాకింగ్ అప్‌డేట్

  ప్రభాస్ కొత్త మూవీపై షాకింగ్ అప్‌డేట్


  ప్రభాస్ నటిస్తోన్న ‘రాధే శ్యామ్'కు సంబంధించిన అప్‌డేట్ కోసం.. ఆయన అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన పుట్టినరోజున మూవీ నుంచి సర్‌ప్రైజ్ రాబోతున్నట్లు రెబెల్ స్టార్ ప్రకటించాడు. దీనికితోడు అతడి ఫ్యూచర్ ప్రాజెక్టుల నుంచి కూడా కానుకలు ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

  Prabhas సెల్పీ పై కామెంట్స్, Fitness గాలికొదేలిశాడు | TROLLS
  ఒక్కటి కూడా లేకపోతే జీర్ణించుకుంటారా.!

  ఒక్కటి కూడా లేకపోతే జీర్ణించుకుంటారా.!

  ‘రాధే శ్యామ్' ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ మూవీపై ఓ న్యూస్ లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క ఫైట్ కూడా ఉండదట. ఫీల్ గుడ్ మూవీలా తెరకెక్కించేందుకే దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరి దీన్ని ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా అంటే డౌటే.

  English summary
  Prabhas' next is titled "O Dear", a title that could be used across the nation in whichever the language the film gets dubbed and released. Being made with a stunning budget, recently the film's team made ample changes to the script upon the insistence of Prabhas.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X