ప్రకాష్ రాజ్ నా దత్త పుత్రుడు.. మోహన్ బాబు నా క్లాస్ మెట్: ఘాటైన కౌంటర్ ఇచ్చిన సిద్దార్థ్

టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న హీరో సిద్దార్థ్ ఇటీవల కాలంలో కాస్త విబిన్నంగా దర్శనమిస్తున్నాడు. నటుడిగా తెలుగులో చాలా తక్కువగానే కనిపిస్తున్నప్పటికి మాటలతో మాత్రం అందరికి షాక్ ఇస్తున్నాడు. సెటైర్లు వేయడంలో పొలిటికల్ లీడర్స్ ను కూడా వదిలి పెట్టడం లేదు. ఇక నెటిజన్ల మాటలకు కూడా గట్టిగానే కౌంటట్ వేస్తున్నాడు. ఇటీవల వయసుకు సంబంధించిన కామేంట్స్ రావడంతో సిద్దార్థ్ మరోసారి ఘాటైన సమాధానాలు ఇచ్చాడు.

ఆ సినిమాలతో భారీ క్రేజ్

ఆ సినిమాలతో భారీ క్రేజ్

సిద్దార్ట్ మొదట తెలుగు సినిమాలతోనే హీరోగా మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. నువ్వొస్తానంటే నేనొద్దంటానా - బొమ్మరిల్లు సినిమాలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. అంతే కాకుండా సిద్దార్థ్ కెరీర్ కు ఆ సినిమాలు సరిపోయేంత క్రేజ్ ను కూడా అంధించాయి. ఇక కొన్నాళ్లకు వరుస అపజయాలతో గ్యాప్ వచ్చేసింది.

నారప్ప కాంట్రవర్సీ

నారప్ప కాంట్రవర్సీ

ఇక ప్రస్తుతం మహా సముద్రం సినిమాతో మళ్ళీ బిజీ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో నారప్పకు సంబంధించిన ఒక కాంట్రవర్సీ వైరల్ గా మారింది. దీంతో అందులోకి కొంతమంది సిద్దార్థ్ ను కూడా లాగేశారు. నారప్ప సినిమాలో వెంకటేష్ సరసన ఒక పాత్రలో అమ్ము అభిరామి నటించింది. అయితే ఇటీవల వారికి సంబంధించిన పోస్టర్ ను చూసిన కొంతమంది ఆమె వయసు వెంకీ వయసులో మూడవ వంతు కూడా ఉండదేమో అనే కామెంట్స్ చేశారు.

మనవరాలి వయసున్న అమ్మాయితో రొమాన్స్

మనవరాలి వయసున్న అమ్మాయితో రొమాన్స్

అంతే కాకుండా మనవరాలి వయసున్న అమ్మాయితో రొమాన్స్ ఏమిటో అని మరికొందరు కామెంట్ చేశారు. ఇక ఆ కామెంట్స్ లలో మరొక నేటిజన్ సిద్దార్థ్ ను ట్యాగ్ చేసి 40+ ఉన్న సిద్దుపై వలపు బాణాల విసురుతూ ఉంటారు. అలాంటిది వెంకీ సినిమాలోని పాత్ర కోసం ఆ అమ్మాయితో జోడి కడితే తప్పు ఏమిటి అని కౌంటర్ ఇస్తాడు.

అతను నా దత్త పుత్రుడు

అతను నా దత్త పుత్రుడు

ఇక సిద్దార్థ్ ఆ విషయంపై గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఈ విషయంలో ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? ట్యాగ్ చేశావ్. సూపర్ రా దరిద్రం. ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి మెంటలోళ్లు అంటూ సిద్ధార్థ్ కౌంటర్ ఇచ్చాడు. అంతే కాకుండా ప్రకాష్ రాజ్ మీ క్లాస్ మేంట్ కదా అని మరొకరు కామెంట్ చేయగా సిద్దార్థ్ ఇలా ఆన్సర్ ఇచ్చాడు. అతను నా దత్త పుత్రుడు. నేను మోహన్ బాబు గారు క్లాస్ మెంట్స్. దయచేసి మీ వాస్తవాలను సూటిగా తెలుసుకోండి.. అని కౌంటర్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X