For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ దేశంలో యుద్ధం.. బాధితులకు తన రెమ్యునరేషన్‌ త్యాగం.. హీరోయిన్ గురించి శివకార్తీకేయన్ ఎమోషనల్

  |

  శివకార్తికేయన్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఎంటర్‌టైనర్‌ మూవీ ప్రిన్స్. శివకార్తికేయన్ జంటగా మారియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటించింది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పాన్ ఇండియా స్టార్ విజయ దేవరకొండ, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిధులుగా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో శివకార్తీకేయన్ మాట్లాడుతూ..

  విజయ్ దేవరకొండ చాలా స్వీట్

  విజయ్ దేవరకొండ చాలా స్వీట్


  అందరికి నమస్కారం. శుభ సాయంత్రం. ముందుగా విజయ్ దేవరకొండ గురించి మాట్లాడాలి. ఇండియన్ సినిమాలో స్మార్టెస్ట్ యాక్టర్. అందుకే నేను ట్వీట్ చేశాను. అతడి ఫోటోలు, వీడియోలు చూస్తే నేను హ్యాపీగా ఫీలవుతాను. నేను గీతా గోవిందం సినిమా చాలా సార్లు చూశాను. ఆ సినిమాలో చాలా స్వీట్‌గా కనిపించాడు. నేను వ్యక్తిగతంగా కలిసినప్పుడు సినిమాలో కంటే.. స్వీట్‌ అనిపించాడు. నేను తొలిసారి కలిశాను అని శివకార్తీకేయన్ అన్నారు.

  విజయ్ దేవరకొండ ప్రిన్స్‌లా కనిపిస్తున్నారు..

  విజయ్ దేవరకొండ ప్రిన్స్‌లా కనిపిస్తున్నారు..


  సినిమా పరిశ్రమలో నా కెరీర్ 15 ఏళ్లుగా చిన్న రైలు ప్రయాణంలా సాగుతున్నది. కానీ విజయ్ దేవరకొండ కెరీర్ మాత్రం రాకెట్‌లా దూసుకెళ్లింది. కొద్ది సమయంలోనే పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఆయన జర్నీ చాలా ఇన్స్‌పైరింగ్. నేను ఎప్పుడైనా ఆయన ఫోటో చూస్తే.. ఇంత స్టార్ట్‌గా ఎలా ఉన్నాడని అనుకొంటాను. అందుకేనేమో అమ్మాయిలంతా ఆయన వెనుక పడుతారని అనుకొంటాను. ఈ రోజు ఆయన చూస్తే.. ప్రిన్స్‌లా కనిపిస్తున్నారు. మా ట్రైలర్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చినందుకు థ్యాంక్స్. మనమిద్దరం ఒక సినిమా చేద్దాం బ్రదర్. మీతో పని చేయాలని కోరుకొంటున్నాను. హరీష్ శంకర్ అనుకొంటే.. మా ఇద్దరి సినిమా సాధ్యం అవుతుందని భావిస్తున్నా. విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషీ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకొంటున్నాను అని శివకార్తీకేయన్ అన్నారు.

  చెన్నైలో గబ్బర్ సింగ్ సినిమా చూడు

  చెన్నైలో గబ్బర్ సింగ్ సినిమా చూడు


  ఇక హరీష్ శంకర్ గురించి మాట్లాడుతూ.. నా గురించి మంచి మాటలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. మీ గబ్బర్ సింగ్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నేను చెన్నైలో ఆ సినిమా చూశాను. మీరు కూడా చెన్నైలో ఆ సినిమా చూడాలి. పోలీస్ స్టేషన్ సీన్ థియేటర్లలో ప్రేక్షకుల గొడవతో విస్పోటనం జరిగిందా అనే విధంగా ఉంటుంది. మాకు మంచి వినోదాన్ని అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని శివకార్తీకేయన్ అన్నారు.

  అనుదీప్ మార్క్ హ్యుమర్

  అనుదీప్ మార్క్ హ్యుమర్


  నా నిర్మాతలు సునీల్ నారంగ్ అంటే నాకు ఇష్టం. చాలా బిందాస్‌గా కనిపిస్తారు. ఆయన కూర్చొన్న తీరు చూస్తే ఈ సినిమాకు సంబంధం లేదనే విధంగా కనిపిస్తాడు. సురేష్ బాబు, రామ్మోహన్ రావు, జాన్వీకి నా థ్యాంక్స్. ఈ సినిమాలో భాగం చేసినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా అనుదీప్ మార్క్ హ్యుమర్‌తో ఉంటుంది. ప్రతీ ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతున్నది. తప్పకుండా ఈ సినిమాను థియేటర్లలోనే చూడండి అని శివకార్తీకేయన్ అన్నారు.

  తెలుగు ప్రేక్షకులకు నా థ్యాంక్స్

  తెలుగు ప్రేక్షకులకు నా థ్యాంక్స్


  తెలుగు సినిమా ప్రేక్షకులకు చాలా బిగ్ థ్యాంక్స్. నా సినిమాలను ఆదరించినందుకు రుణపడి ఉంటాను. భాషా బేధం లేకుండా అందరి హీరోల సినిమాలను ఆదరిస్తున్నారు. వరుణ్ డాక్టర్, డాన్ సినిమాలను పెద్ద హిట్ చేశారు. నాకు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. తమన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా పెద్ద సినిమాలకు సంగీతం అందించాలి. మరిన్ని నేషనల్ అవార్డులు అందుకోవాలి అని శివకార్తీకేయన్ అన్నారు.

  యుద్ద బాధితులకు హీరోయిన్ రెమ్యునరేషన్

  యుద్ద బాధితులకు హీరోయిన్ రెమ్యునరేషన్


  హీరోయిన్ మారియాతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మీ దేశంలో పరిస్థితులు బాగాలేవు. అయినా మీరు ఈ సినిమాలో కమిట్‌మెంట్ పనిచేశారు. ఈ సినిమాలో ఆఫర్ ఇచ్చినప్పుడు ఆమె ఒక మాట చెప్పారు. మీరు ఇచ్చే రెమ్యునరేషన్‌ను నా దేశంలోని యుద్ధ బాధితులకు ఇస్తానని చెప్పారు. ఆమెకు ఉన్న దేశభక్తి అలాంటిది. అలాంటి హృదయం ఉన్న వారికి దేవుడు ఎప్పుడు ఆనందాన్ని ఇస్తాడు. మీ దేశం, మీరు చాలా సంతోషంగా ఉండాలని కోరుకొంటున్నాను అని శివకార్తీకేయన్ అన్నారు.

  English summary
  Sivakarthikeyan emotional Speech Prince Pre Release Event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X