Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu: ఈ రోజు ఈ రాశుల వారు అదనపు ఖర్చులు తగ్గించుకోండి..
- News
విజయనగరం కాదని నిరూపించు.. కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్
- Sports
India vs Zimbabwe: జాతీయ గీతం పాడుతుండగా ఇషాన్ కిషన్‌పై దాడి..!
- Automobiles
మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? Alto K10 vs Renault Kwid
- Technology
శ్రీకృష్ణ జన్మాష్టమికి అదిరిపోయే స్టిక్కర్లతో Whatsapp లో విషెస్ చెప్పండి!
- Finance
వీళ్లు మామూలోళ్లు కాదుగా.. బ్యాంకుకు కన్నం వేసేందుకు సొరంగం.. అనుకున్నదొకటి అయ్యిందొకటి..
- Travel
ఒకప్పటి రాజ నివాసాలు.. ఇప్పుడు విలాసవంతమైన విడిది కేంద్రాలు
హైదరాబాద్ లో ల్యాండ్ అయిన మహేష్ బాబు.. ఇక ఆ పనుల్లో బిజీ!
సూపర్ సార్ మహేష్ బాబు ప్రస్తుతం లండన్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం తన కుమారుడిని కాలేజీలో చేర్పించడం కోసం లండన్ వెళ్లిన ఆయన ఎట్టకేలకు ఆ విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

వెకేషన్ మోడ్ లో
చివరిగా సర్కారు వారి పాట అనే సినిమా చేసిన మహేష్ బాబు. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది కానీ కలెక్షన్ విషయంలో కాస్త సందిగ్దత పరిస్థితిలు అయితే నెలకొన్నాయి. సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాక మంచి కలెక్షన్లు రాబట్టింది అని సినిమా యూనిట్ చెబుతుంటే ట్రేడ్ అనా లిస్టులోలు మాత్రం సినిమా బ్రేక్ ఈవెన్ చేయలేదని పేర్కొన్నారు. ఆ విషయం పక్కన పెడితే మహేష్ బాబు సినిమా విడుదలైనప్పటి నుంచి ఒక రకంగా వెకేషన్ మోడ్ లోనే ఉన్నారు.

తిరిగి హైదరాబాదులో
కొన్నాళ్లపాటు దుబాయ్ వెళ్లి రెస్ట్ తీసుకున్న ఆయన తర్వాత వేరే దేశాల్లో కూడా పర్యటించారు. తాజాగా తన కుమారుడు గౌతమ్ ను లండన్ కాలేజీలో చేర్పించడం కోసం ఆయన లండన్ వెళ్లారు. లండన్ లో కొన్నాళ్లుగా తన ఫ్యామిలీతో ఆయన క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. తన కుమార్తెతో కలిసి ఉన్న ఒక ఫోటో కూడా లండన్ నుంచి లీక్ కాగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే కుమారుడిని కాలేజీలో చేర్పించిన తరువాత మహేష్ బాబు తిరిగి హైదరాబాదులో అడుగు పెట్టారు.

మొదలు కాక ముందే
మహేష్ బాబు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ బాబు ఈ నెలలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుండగా హారిక హాసిని క్రియేషన్స్ మీద చినబాబు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాక ముందే సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో
గతంలో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెండు సినిమాలు రావడం అందులో ఒక సినిమా సూపర్ హిట్ అయ్యి మరో సినిమా యావరేజ్ గా నిలవడంతో ఈ సినిమా హిట్ అయ్యే విధంగా ఉంటుందని మహేష్ బాబు అభిమానులైతే నమ్మకాలు పెట్టుకుంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది.

భారీ అంచనాలు
ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఇప్పటి నుంచే ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు కధ ఫైనల్ అవ్వలేదని మహేష్ బాబు చెబుతుంటే ఫైనల్ అయిపోయింది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ పూర్తయిందని విజయేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. ఈ విషయం మీద ఇప్పటిదాకా సరైన క్లారిటీ అయితే లభించలేదు. ఇక ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు.