RGV bikini babe Comment: దిమ్మ తిరిగే జవాబిచ్చిన టైగర్ ష్రాఫ్..

బాలీవుడ్‌లో కండలవీరుడిగా మారిన టైగర్ ష్రాప్‌పై గతంలో దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దేహదారుడ్యం విషయాన్ని పక్కన పెడితే ముఖం చూస్తే హీరోయిన్‌ మాదిరిగా ఉందంటూ నెటిజన్లు, సినీ ప్రముఖులు ట్రోల్ చేశారు. అయినా ఆ ట్రోల్స్‌ను పట్టించుకోకుండా యాక్షన్ హీరోగా ఎదిగాడు. తాజాగా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న క్విక్ హీల్ టాక్ షోలో తనపై వస్తున్న ట్రోల్స్, దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్‌పై టైగర్ ష్రాఫ్ స్పందించారు. అర్బాజ్ ఖాన్ టాక్‌లో జరిగిన విషయాలు ఏమిటంటే...

హోస్ట్‌గా అర్బాజ్ ఖాన్‌తో

హోస్ట్‌గా అర్బాజ్ ఖాన్‌తో

సల్మాన్ సోదరుడు, మలైకా అరోరా మాజీ భర్త, నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ హోస్ట్‌గా అవతారం ఎత్తారు. బాలీవుడ్‌లోని టాప్ స్టార్లను ఇంటర్వ్యూ చేస్తున్నారు. తన టాక్ షోలో భాగంగా తొలి ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్‌ను, రెండో ఎపిసోడ్‌లో ఆయుష్మాన్ ఖురానాను ఇంటర్వ్యూ చేశారు. మూడో ఎపిసోడ్‌లో జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్‌ను ఆహ్వానించారు. ఈ షోలోకి తదుపరి ఎపిసోడ్‌లో ఫరా ఖాన్, అన్యన్య పాండే, ఇంకా పలువురు తారలు రానున్నారు.

బికినీ బేబ్ అంటూ రాంగోపాల్ వర్మ కామెంట్

బికినీ బేబ్ అంటూ రాంగోపాల్ వర్మ కామెంట్

అయితే క్విక్ హీల్ టాక్‌లో టైగర్ ష్రాఫ్‌తో అర్బాజ్ ఖాన్ మాట్లాడుతూ.. రాంగోపాల్ వర్మ బికినీ బేబ్ అని కామెంట్ చేయడం, హీరోయిన్‌లా ఉన్నాడంటూ వచ్చిన కామెంట్స్‌ను అర్బాజ్ ఖాన్ ప్రస్తావించారు. అయితే తనను ఉద్దేశించి బికినీ బేబ్ రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్లను గుర్తు చేసుకొన్నాడు. సముద్రంలో అర్ధనగ్నంగా నీటిలో తడిచి ఉండగా దిగిన ఫోటోను చూసి రాంగోపాల్ వర్మ కామెంట్ చేశాడు అని చెప్పారు.

నీవు బ్రూస్ లీ కాలేవు అంటూ

నీవు బ్రూస్ లీ కాలేవు అంటూ

రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో పోస్టు పెడుతూ.. నీవు మార్షల్ ఆర్ట్స్‌లో గ్రేట్ కావొచ్చు. కానీ నీ మాదిరిగా బికిని బేబ్ మాదిరిగా బ్రూస్ లీ ఫోజు పెట్టలేదు. నీవు ఎలా అయితే బ్రూస్ లీ కాలేవు. ఆ విషయాన్ని నీవు మరోసారి ఆలోచించు. మీ నాన్న జాకీ ష్రాఫ్ (బిదూ)ను చూసి మగాడిలా ఉండేలా నేర్చుకో. మార్షల్ ఆర్ట్స్ లేకుండా మగాడిగా కనిపించు. ఇలా అర్ధనగ్నంగా కనిపించకు అని ట్వీట్ చేశాడు అని టైగర్ ష్రాఫ్ గుర్తు చేశారు.

వర్మ చెప్పింది నిజమే అంటూ..

వర్మ చెప్పింది నిజమే అంటూ..

అయితే రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్లకు సమాధానం ఇస్తూ.. అవును. వర్మ చెప్పింది నూటికి నూరు శాతం నిజమే. ఆ విషయంలో నా తండ్రి జాకీ ష్రాఫ్‌ను తలదన్నేవాళ్లు లేరు. ఒక్క సల్మాన్ ఖాన్ తప్ప. ఇక నేను బ్రూస్ లీని మ్యాచ్ చేయలేను. ఆ విషయంలో వర్మ సార్ కరెక్ట్. అని టైగర్ ష్రాఫ్ తెలివిగా స్పందించారు. తాను హీరోయిన్ మాదిరిగా ఉంటానని చెప్పిన విషయాలు తప్పని నిరూపించాను అంటూ టైగర్ ష్రాఫ్ పేర్కొన్నారు.

అర్బాజ్ ఖాన్ షోలో ఆర్థిక సమస్యలతో

అర్బాజ్ ఖాన్ షోలో ఆర్థిక సమస్యలతో

ఇంకా క్విక్ హీల్ షోలో అర్బాజ్ ఖాన్‌తో టైగర్ ష్రాఫ్ పలు విషయాలను పంచుకొన్నారు. నీవు బ్రహ్మాచారివేనా అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇంకా తన బాల్యంలో చోటుచేసుకొన్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, సహ నటులతో ఉన్న సంబంధాలను వివరంగా చర్చించారు. ఈ షో త్వరలోనే ప్రసారం కానున్నది.

బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X