For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాళ్ళు కుక్కలు.. నన్ను కిందకు లాగేందుకు కుట్ర.. విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు

  |

  సినిమా ఇండస్ట్రీలో మళ్లీ సినిమాల హడావుడి బాగానే మొదలైంది. అయితే ఆ హడావుడి ఎన్ని రోజులు ఉంటుందో చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ క్రమంలో చాలా సినిమాలు మళ్లీ విడుదల తేదీలను వాయిదా వేసుకోక తప్పదు. కానీ కొన్ని సినిమాలు మాత్రమే థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఎంతో ధైర్యంతో వచ్చిన సినిమాల్లో విశ్వక్ సేన్ పాగల్ కూడా ఉంది. హీరో గా నటించిన ఈ సినిమా ఓ వర్గం వారి నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. మొదటి షో నుంచి కూడా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటూ ముందుకు సాగుతోంది.

  Vishwak Movie Team Speech At Teaser Launch Event

  శని ఆదివారాలు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇక సోమవారం ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈరోజు నిలదొక్కుకుంటే సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. హీరో విశ్వక్సేన్ మాత్రం ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. మీడియాలో సినిమాపై బజ్ క్రియేట్ చేయడమే కాకుండా థియేటర్స్ లోకి కూడా వెళ్లి ఆడియన్స్ తో కూర్చొని సినిమా చూస్తున్నాడు. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అందుకుంటూ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

  ఆవేశంతో మాట్లాడినప్పటికీ..

  ఆవేశంతో మాట్లాడినప్పటికీ..

  ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా పరిచయం అయిన విశ్వక్ సేన్ ఆ తర్వాత స్వీయ దర్శకత్వంలో ఫలక్ నుమా దాస్ సినిమా చేశాడు. ఆ తరువాత మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక పాగల్ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.

  దిల్ రాజు లాంటి బడా నిర్మాత ఈ సినిమా వెనుక ఉన్నప్పటికీ సినిమా విడుదల చివరి నిమిషం వరకు కాస్త సస్పెన్స్ క్రియేట్ చేసింది. విశ్వక్ సేన్ కూడా పైకి కాస్త ఆవేశంతో మాట్లాడినప్పటికీ మనసులో మాత్రం చాలా కంగారు పడినట్లు చెబుతున్నాడు.

  బాక్సాఫీస్ టార్గెట్..

  బాక్సాఫీస్ టార్గెట్..

  మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అయితే మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. విశ్వక్ సేన్ పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా రిలీజ్ పై ఎంతో ధీమాతో మాట్లాడారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని తన చిత్ర యూనిట్ సభ్యులకు ఎంతో నమ్మకంగా చెప్పాడట. ఈ సినిమా తేడా కొడితే తన పేరు కూడా మార్చుకుంటారని డైరెక్ట్ గా జనాల ముందే ఎంతో ఛాలెంజింగ్ గా మాట్లాడాడు.

  ఇక ఎంతో నమ్మకంతో వచ్చిన ఈ సినిమా సినిమా మొదటి రోజే ఓ వర్గం యూత్ ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ ని అయితే అందుకుంది. ఈ సినిమా 6.5 కోట్ల బిజినెస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చినట్లు టాక్ అయితే వస్తోంది.

  ప్రేక్షకులే తన అసలైన బ్యాక్ గ్రౌండ్

  ప్రేక్షకులే తన అసలైన బ్యాక్ గ్రౌండ్

  ఇక నెగిటివ్ కామెంట్ చేసే వారిపై కూడా విశ్వక్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. చాలామంది కిందకు లాగేందుకు ప్రయత్నం కూడా చేశారని అయితే చివరికి ప్రేక్షకుల మద్దతుతో గెలిచామని కూడా ఉన్నాడు. తనకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని ప్రేక్షకులే తన అసలైన బ్యాక్ గ్రౌండ్ బలం అంటూ చాలా ఎమోషనల్ గా వివరణ ఇచ్చాడు.

  సినిమాపై కావాలని నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేసేవారిని విశ్వక్ సేన్ కుక్కలతో పోల్చాడు. ఏనుగులు వెళుతుంటే.. కుక్కలు చాలానే మెరుగుతాయని వాటిని పెద్దగా పట్టించుకోవద్దని అన్నాడు.

  ఓటీటీ ఆఫర్స్ బాగానే వచ్చాయి

  ఓటీటీ ఆఫర్స్ బాగానే వచ్చాయి

  అసలు ఈ సినిమాను ముందుగా ఓటీటీ లోనే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు చాలా రోజులు చర్చలు జరిపారు. ఓటీటీ ఆఫర్స్ కూడా బాగానే వచ్చయట. కానీ హీరో విశ్వక్ సేన్ మాత్రం ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడినట్లు చెప్పాడు. సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలని సినిమా చూసిన తర్వాత ఆడియోన్స్ రెస్పాన్స్ ను కూడా దగ్గరుండి చూడాలని మనసులో చాలా బలంగా అనుకున్నాడట. ఇటీవల సక్సెస్ మీట్ లో విశ్వక్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి.

  సమస్యలు అన్ని వైపుల నుంచి..

  సమస్యలు అన్ని వైపుల నుంచి..

  విశ్వక్ సేన్ ఇంకా ఏమన్నాడంటే.. ఒక వైపు నుంచి కాదు.. సమస్యలు అన్ని వైపుల నుంచి ఉన్నాయి. పబ్లిసిటీ కోసం మాకు చాలా తక్కువ సమయం ఉంది. AP లో, మాకు 50% ఆక్యుపెన్సీ మంత్రమే ఉంది, నైట్ షోలు లేవు అలాగే తక్కువ టిక్కెట్ ధరలు మరొక పెద్ద రిస్క్. ఇక మొదటి షోకి ముందు కూడా కొంతమంది నన్ను క్రిందికి లాగడానికి ప్రయత్నించారు, అని విశ్వక్ బాధతో చెప్పాడు.

  ఇక ఈ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చెబుతూ.. HIT కంటే ఓపెనింగ్ 40% ఎక్కువ. నేను విడుదలకు ముందు సినిమా ప్రమోషన్ కోసం ఎవరైనా సహాయం చేసే బావుంటుందమే అని అనుకున్నాను. నాకు ఎవరినుంచైనా సపోర్ వస్తుందా లేదా అని చూసేంత సమయం కూడా లేదు.

  కానీ ఇప్పుడు ఎవరూ నాకు మద్దతు ఇవ్వరని నేను గ్రహించాను. ప్రేక్షకులు మాత్రమే నాకు అండగా నిలుస్తారని అనిపించింది. ఈ సినిమా ద్వారా వారి ప్రేమను నేను గ్రహించాను.. అని విశ్వక్ సేన్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

  English summary
  Tollywood hero vishwak sen shocking comments on negative news
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X