Just In
Don't Miss!
- News
చంద్రబాబు చచ్చిన పాముతో సమానం..ఎక్కడికెళ్ళినా పీకేదేం లేదు: విజయసాయి రెడ్డి ధ్వజం
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Sports
ఇంగ్లండ్ ఓటమిని ఎగతాళి చేసిన ఆ దేశ మహిళా క్రికెటర్.. మండిపడ్డ పురుష క్రికెటర్లు!
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలయ్య విగ్గులపై జోకులు.. అసలు కహానీ ఇదీ..!
బాలయ్య సినిమాలు ఒకెత్తు అయితే.. ఆయన గెటప్పులు మరో ఎత్తు. సినిమా కథ, కథనాలు ఎంత జాగ్రత్తగా రాసుకుంటారో.. బాలయ్య గెటప్, విగ్గులు కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే వీటిపై సోషల్ మీడియాలో ఎన్ని రకాల మీమ్స్ హల్ చల్ చేస్తుంటాయో ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. తాజాగా విడుదలైన రూలర్ చిత్రం ఏ మేరకు విమర్శపాలైందో అందరికీ తెలిసిందే. ఇందులోని బాలయ్య లుక్‌పై ఫస్ట్ నుంచే ట్రోలింగ్స్ మొదలయ్యాయి.

టోని స్కార్ట్ లుక్..
ఈ మూవీ నుంచి ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ టోని స్టార్క్ లుక్‌లో ఉన్న బాలయ్య. మొదట ఇది ఏ చైనీస్ యాక్టర్ పోస్టరో అనుకున్నారంతా. అయితే అది మన బాలయ్యే అని అందరూ షాక్ అయ్యారు. అంతలా అందర్నీ షాక్‌కు గురి చేసింది బాలయ్య లుక్. ఇది ఒక వింత అయితే మరో గెటప్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ధర్మ పాత్రకు బీభత్సమైన విగ్..
రూలర్ చిత్రంలో పోలీసాఫీర్ పాత్రలో బాలయ్య విగ్ గురించి ఎంత తక్కవ చెప్పుకుంటే అంత మంచింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఆ విగ్, గెటప్‌పై కామెంట్ చేయకుండా ఉండలేరు. అంతలా అందర్నీ భయపెట్టింది ఆ విగ్. అసలు ఆ విగ్‌ను బాలయ్య, యూనిట్ ఎలా ఓకే చేసిందో ఎవ్వరికీ తెలియదు.

విగ్ కోసం లండన్..
బాలయ్య తన మేకప్‌మ్యాన్‌లపై ప్రదర్శించే కోపంతో సినిమా సినిమాకు వారు మారుతుంటారట. పైగా ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు లండన్ వెళ్లి ప్రత్యేకంగా విగ్‌ను తయారు చేయించుకుంటాడట.ఈ క్రమంలో బాలయ్యకు ఎదురు చెప్పి.. అది బాలేదు ఇది బాలేదు అని చెప్పే సాహసం ఎవ్వరూ చేయరట.

అప్పట్లో ఎన్టీఆర్ మాత్రం..
ఇలా సినిమాకో మేకప్‌మ్యాన్‌ను మార్చే బాలయ్య.. తన తండ్రిగారి పద్దతిని మాత్రం ఫాలో కాలేదు. నందమూరి తారకరామారావు వద్ద ఒకే ఒక్క మేకప్‌మ్యాన్ ఉండేవాడు. ఆయనే పీతాంబరం. ఆయనను ఎంత గౌరవించేవాడో సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ఉన్నవారందరికీ తెలుసు. మరి బాలయ్య మాత్రం ఇలా మేకప్ మ్యాన్‌ను మారుస్తూ.. గెటప్, విగ్‌లపై శ్రద్ద చూపించకుండా విమర్శల పాలవుతున్నాడు.