Don't Miss!
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- News
girl: కాలేజ్ అమ్మాయి మీద జరదా బీడా ఉమ్మేశాడు. అమ్మాయి ముఖం మీద కత్తితో ?
- Sports
IND vs NZ: హార్దిక్ పాండ్యా.. ఇంత స్వార్థమా? నీ దోస్తుల కోసం పృథ్వీ షాను పక్కనబెడతావా? ఫ్యాన్స్ ఫైర్
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
అయ్యప్పనుం రీమేక్ కి వకీల్ సాబ్ టెన్షన్.. ఒక సారి వర్కౌట్ కాలేదు, అయినా ఎందుకీ ప్రయోగం?
వకీల్ సాబ్ ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆయన వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్ల సినిమా ఒకటి కాగా, మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ ఒకటి. అది ఈ సినిమాకు సంబంధించిన ఒక అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగ వంశీ గతంలో మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో సూర్యదేవర నాగ వంశీ తమ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇదే అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏమిటంటే?

ఫ్లాష్ బ్యాకే మైనస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. బోనికపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో వంక పెట్టాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని చెప్పక తప్పదు. ఈ సినిమాలో పవన్ తో శ్రుతి హాసన్ ఎపిసోడ్ మాత్రం జనాన్ని అసలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. నిజానికి ఒరిజినల్ పింక్ సినిమాలో ఇలాంటి ఎపిసోడ్ ఏదీ లేదు. కానీ తెలుగు ప్రేక్షకుల కోసం స్పెషల్ గా దీన్ని డిజైన్ చేశామని చెప్పుకుని మరీ వదిలారు దర్శకనిర్మాతలు.

వర్కౌట్ కానప్పుడు మళ్ళీ ఎందుకు
ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పండక పోవడంతో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం రీమేక్ సినిమాలో కూడా ఈ సీన్స్ అవసరమా అనే చర్చ నడుస్తోంది. నిజానికి ఒరిజినల్ మలయాళం సినిమాల్లో కూడా ఫ్లాష్ బ్యాక్ అనే దాన్ని పెద్దగా చూపరు. అందులో బిజు మీనన్ కి గతంలో నక్సల్ నేపథ్యం ఉందని చెబుతారు తప్ప ఎక్కడా దాన్ని హైలెట్ చేసి చూపే ప్రయత్నం చేయలేదు. కానీ తెలుగు విషయానికి వచ్చేసరికి పవర్ స్టార్ కోసం ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ క్రియేట్ చేశామని నిర్మాత చెప్పడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

పొలిటికల్ టెన్షన్
అదీగాక ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి పొలిటికల్ టచ్ కూడా ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాలో సమాజాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ లో ఆ సినిమా మీద తీవ్ర ఆంక్షలు విధించారని, ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించే విధంగా డైలాగులు ఉంటే ఈ సినిమా మీద కూడా ఆంక్షలు తప్పవేమో అనే మాట వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఈ అంశంతో కాస్త ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

అప్పుడే ఏమీ చెప్పలేం
అయితే సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న కారణంగా అప్పుడే పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయా లేక సాధారణంగా ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారా అనేది ఇప్పటికీ చెప్పలేని అంశమే. సో సినిమా ఫైనల్ కట్ వచ్చాక అసలు సంగతి ఏమిటనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పవన్ కు ప్రత్యర్ధి పాత్రలో రానా నటిస్తున్న ఈ సినిమాలో రానాకు జంటగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. పవన్ కు జోడీని వెతికే పనిలో ఉన్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తూ డైలాగ్స్ అందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కు అస్వస్థత ఏర్పడిన కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.