ఆ స్టార్ దర్శకుడితో 75వ సినిమా.. నా చేతుల్లో ఏమి లేదు: వెంకటేష్
టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. అయితే అందులో చాలామందికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ వెంకటేష్ కు మాత్రం పెద్దగా నెగిటివ్ ఫ్యాన్స్ ఉండరు. ఆయనంటే దాదాపు అందరు హీరోల ఫ్యాన్స్ ఇష్టపడతారు. స్టార్ ఇమేజ్ ను పట్టించుకోకుండా మల్టీస్టారర్ సినిమాలు చేయడం కూడా ఆయనకు మంచి క్రేజ్ ను అందించింది.
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే వెంకటేష్ 75వ సినిమాపై గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే ఆ సినిమా ఉంటుందని అప్పట్లో అఫీషియల్ గా క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఆ సినిమా ఎప్పుడు ఉంటుందనే విషయంపై వెంకటేష్ ను అడుగగా ఆయన సింపుల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఏది కూడా తన చేతుల్లో లేదని అంటూ ముందుగా ఏ స్క్రిప్ట్ సిద్దమైతే దాన్ని స్టార్ట్ చేయడమే అని క్లారిటీ ఇచ్చేశారు.

త్రివిక్రమ్ - వెంకటేష్ కాంబినేషన్ ఇప్పటిది కాదు. వీరి కలయికలో పదేళ్ల క్రితమే సినిమా రావల్సింది. కానీ అనేక కారణాల వలన అది వాయిదా పడుతూనే ఉంది. దర్శకుడిగా కాకపోయినా వెంకీ హిట్ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేశాడు.
నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి సినిమాలు త్రివిక్రమ్ రైటింగ్ వలనే బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం నారప్ప రిలీజ్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న వెంకటేష్ ఓటీటీలో విడుదల చేసినందుకు అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇక నెక్స్ట్ దృశ్యం, F3 సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications











