For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విజయ్ దేవరకొండ ఖాతాలో మరో అవార్డ్.. సినిమా ఆడకున్నా అరుదైన ఘనత దక్కింది

  By Manoj
  |

  'పెళ్లి చూపులు' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో ఎంతో డీసెంట్‌గా కనిపించాడు. అయితే, తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'లో మాత్రం తనలోని సరికొత్త నటుడిని పరిచయం చేశాడు. ఎన్నో వివాదాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క సినిమానే విజయ్ దేవరకొండ కెరీర్‌ను అమాంతం మార్చేసింది. ఆ తర్వాత వచ్చిన 'గీత గోవిందం'తో అతడి మార్కెట్ కూడా బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకు ఓ అరుదైన అవార్డు దక్కింది. అది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడిన సినిమాకు. ఇంతకీ ఏంటా అవార్డు.? ఏ సినిమాకు దక్కింది.? పూర్తి వివరాల్లోకి వెళితే..

  నలుగురు లవర్లతో ఎంజాయ్

  నలుగురు లవర్లతో ఎంజాయ్

  క్రేజీ హీరో విజయ్ దేవరకొండ.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్'. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లె లైట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో విజయ్.. నలుగురు అమ్మాయిలను ప్రేమిస్తాడట. అది కూడా ఏక కాలంలో అని ప్రచారం జరుగుతోంది.

  డైనమిక్ డైరెక్టర్‌తో సినిమా ఉంటుందా?

  డైనమిక్ డైరెక్టర్‌తో సినిమా ఉంటుందా?

  ‘వరల్డ్ ఫేమస్ లవర్' విడుదల కాకముందే విజయ్ దేవరకొండ.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధిచిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇందులో విజయ్ మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఫైటర్‌గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం క్లారిటీ రావట్లేదు.

  విజయ్ అక్కడ బాగా బిజీ

  విజయ్ అక్కడ బాగా బిజీ

  ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ అయిపోయిందో.. లేక విశ్రాంతి తీసుకుంటున్నాడో తెలియదు కానీ, ఈ మధ్య అతడు ముంబైలోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. అక్కడ బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లతో కలిసి పార్టీలు చేసుకుంటున్నాడు. దీంతో అతడు టాలీవుడ్‌లోనే కాకుండా బీ టౌన్‌లోనూ హాట్ టాపిక్ అవుతున్నాడు.

  విజయ్ దేవరకొండ ఖాతాలో మరో అవార్డ్

  విజయ్ దేవరకొండ ఖాతాలో మరో అవార్డ్

  క్రేజీ హీరో విజయ్ ఇప్పటికే ఉత్తమ నటుడిగా పలు అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా అతడి ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. ‘బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్ అవార్డ్స్' నిర్వహించిన ఏడవ ఎడిషన్ ఫంక్షన్‌లో దక్షిణాదిలోని అన్ని భాషల నటీ నటులకు అవార్డులు అందించారు. ఇందులో ‘డియర్ కామ్రేడ్' చిత్రానికి గానూ విజయ్‌కు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. కన్నడ హీరో యశ్ చేతులు మీదుగా ఈ అవార్డును అందుకున్నాడు విజయ్.

  CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
  డియర్ కామ్రేడ్ గురించి

  డియర్ కామ్రేడ్ గురించి

  విజయ్ - రష్మిక కలిసి నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్త‌ంగా నిర్మించిన ఈ సినిమాను భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అయింది. దీనిని ప్రేక్షకులు ఆదరించలేదు.

  English summary
  Tollywood Young Hero Vijay Deverakonda Upcoming movie is Dear Comrade. Bharat Kamma directed By This Movie. Bobby, a hot-headed student union leader, falls in love with Lily, a state-level cricketer. But soon his anger issues become a roadblock on his way to unite with Lily.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X